గుబులు పుట్టిస్తున్న సోఫీ డిజైనర్ ఫ్రాక్
అయితే సోఫీ ఆల్ రౌండర్ నైపుణ్యం, సోషల్ మీడియాల్లో స్పీడ్ తనకు అన్నివిధాలా సంపాదనకు సహకరిస్తోంది.
సోఫీ చౌదరి పరిచయం అవసరం లేదు. మోడల్, హోస్ట్, సహాయ నటి, ఐటమ్ గాళ్ ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన ఈ ఎన్నారై గాళ్, ఇటీవల బాలీవుడ్‌లో నటిగా కెరీర్ పరంగా వెనకబడింది. ఇంతకుముందు మహేష్ `1 నేనొక్కడినే` లో `లండన్ బాబులు..` అంటూ సాగే ప్రత్యేక గీతంతో అలరించిన సోఫీ, సినిమా ఫ్లాపవ్వడంతో సౌత్ లో అంతగా మెరవలేదు. బాలీవుడ్ లోను కెరీర్ అంతంత మాత్రమే.
అయితే సోఫీ ఆల్ రౌండర్ నైపుణ్యం, సోషల్ మీడియాల్లో స్పీడ్ తనకు అన్నివిధాలా సంపాదనకు సహకరిస్తోంది. 40 ప్లస్ ఏజ్ లోను వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కొనసాగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోటోషూట్లతో హీటెక్కిస్తూ నిరంతరం చర్చల్లో నిలుస్తోంది.
తాజాగా మరో స్టన్నింగ్ ఫోటోషూట్‌తో కుర్రకారు మతులు చెడగొట్టింది సోఫీ. ఈ ఫోటోషూట్ ఇన్ స్టాలో వైరల్ గా మారుతోంది. సోఫీ డిజైనర్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోసిన తీరు యువతరంలో చర్చగా మారింది. వైట్ అండ్ వైట్ డిజైనర్ ఫ్రాక్ పై నలుపు, ఎరుపు రంగు డిజైనర్ బొమ్మలు ఆకట్టుకోగా, సోఫీ మెడలో ధరించిన గోల్డ్ కలర్ చైన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సముద్ర తీరంలో సోఫీ గుబులు పుట్టించే ఫోజులతో హార్ట్ లో దడ పుట్టించింది. సోఫీ అందచందాలు మతులు చెడగొడుతున్నాయంటూ యూత్ రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ యువతరం వాట్సాపుల్లోను వైరల్ గా మారుతున్నాయి.
సోఫీ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. దాదాపు 16 ఏళ్ల క్రితం `షాది నెంబర్ 1` సినిమాతో బాలీవుడ్ లో ప్రవేశించింది. ఆ తర్వాత `ప్యార్ కే సైడ్ ఎఫెక్స్ట్`.. `ఐ సీయూ` సహా పలు రొమాంటిక్ కామెడీలలో నటించింది. ఆ తర్వాత ఐటమ్ గాళ్ గాను పాపులరైంది. కొన్నేళ్లుగా సరైన ఆఫర్లు లేవు. అయినా మోడలింగ్, యోగా గైడ్ గా బాగానే ఆర్జిస్తోంది.