కాజోల్‌లా కాకుండా ర‌వీనా సౌత్ గేమ్ ప్లాన్

ర‌వీనా టాండ‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ పేరు గుర్తుకు రాగానే బాల‌కృష్ణ `బంగారు బుల్లోడు` సినిమా గుర్తుకు వ‌స్తుంది.

Update: 2024-09-21 23:30 GMT

ర‌వీనా టాండ‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ పేరు గుర్తుకు రాగానే బాల‌కృష్ణ `బంగారు బుల్లోడు` సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఆ సినిమాలో ర‌వీనా టాండ‌న్ గ్లామ‌ర‌స్ యాక్ట్ యూత్ ని ఒక ఊపు ఊపింది. ర‌వీనా బోల్డ్ గ్లామ‌ర‌స్ లుక్స్ కి ఫ్యాన్స్ అయిపోయారు తెలుగు కుర్రాళ్లు. మొహ్రా లాంటి హిందీ సినిమాలో `తూ ఛీజ్ బ‌డీ హై మ‌స్త్ మ‌స్త్` పాట‌లో ర‌వీనా డ్యాన్సుల‌కు మంత్ర ముగ్ధులు కాని వారు లేరు. పూరి జ‌గ‌న్నాథ్ బుడ్డా హోగా తేరా బాప్ చిత్రంలోను ర‌వీనా న‌టించింది.

అదంతా అటుంచితే ఇటీవ‌ల కేజీఎఫ్ 2లో ర‌వీనా రాజకీయ నాయకురాలిగా కనిపించింది. ఈ సీనియ‌ర్ భామ‌ ఆకర్షణీయమైన రూపానికి, అద్భుత న‌ట‌న‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఇప్పుడు నేరుగా టాలీవుడ్ లో ఓ హార‌ర్ సినిమాలో న‌టించేందుకు ర‌వీనా సంత‌కం చేసింద‌ని తెలిసింది. ఈ సినిమా టైటిల్ జ‌టాధార‌. సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ప్రసిద్ధ దక్షిణ భారత నిర్మాత శివిన్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఇది అతీంద్రియ విశ్వానికి సంబంధించిన సినిమా. రవీనా ఇందులో ప్రతినాయక పాత్రలో క‌నిపిస్తుంద‌ని స‌మాచారం.

నిజానికి ఒక గ్లామ‌ర‌స్ స్టార్ గా ఏలిన ర‌వీనా టాండ‌న్ కేజీఎఫ్ లో త‌న ఏజ్ కి త‌గ్గ‌ట్టు డిగ్నిఫైడ్ గా ఉండే పాత్ర‌లో న‌టించారు. ఇప్పుడు ఏకంగా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌డం త‌న‌కు పూర్తిగా కొత్త‌. ర‌వీనా ఈ కొత్త ఛాలెంజ్ ని స్వీక‌రించి విజేత‌గా న‌డుస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. KGF: చాప్టర్ 2లో ప్రశంసలు పొందిన నటనతో బాలీవుడ్‌లో గొప్ప‌ ప్రజాదరణను పొందింది. ఈ చిత్రం గురించి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రెండు చోట్లా అంద‌రి దృష్టిలో ప‌డేందుకు ర‌వీనా ఎంపిక అని అర్థ‌మ‌వుతోంది. ర‌వీనా విల‌న్ పాత్ర పూర్తిగా కొత్త‌ద‌నంతో రీఫ్రెషింగ్ గా ఉంటుంద‌ని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ పాత్ర వ‌ర్క‌వుటైతే రవీనాకు సౌత్ నుంచి అదే త‌ర‌హాలో మ‌రికొన్ని అవ‌కాశాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన సీనియ‌ర్ క‌థానాయిక కాజోల్ కూడా ద‌క్షిణాదిన సీరియ‌స్ గా కెరీర్ ని ప్రారంభించింది. కానీ అది ఇక్క‌డ ఆశించినంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. నాలుగైదు సినిమాల‌కే క‌నుమ‌రుగైంది. కానీ ర‌వీనా ప్ర‌ణాళిక చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

Tags:    

Similar News