స్టార్ హీరో సంప‌ద‌ 420 కోట్లు.. ఆ ఏడు వ్యాపారాల‌తో డ‌బ్బే డ‌బ్బు

దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన అజయ్ దేవగన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 427 కోట్లు.

Update: 2024-11-11 00:30 GMT

దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన అజయ్ దేవగన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 427 కోట్లు. అత‌డు పారితోషికాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంతో పాటు 7 వ్యాపారాల్లో తెలివైన పెట్టుబ‌డుల‌తో ఇంత పెద్ద మొత్తాన్ని ఆర్జించాడు. అత‌డు పెట్టుబడి పెట్టిన కంపెనీలు, బ్రాండ్‌ల వివ‌రాల‌ను

సిఎన్‌.బి.సి- టివి18 రివీల్ చేసింది.

అజయ్ దేవ‌గ‌న్ ఒక్కో సినిమాకి 30 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. దాంతో పాటు ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ కోట్ల‌లో ఆర్జిస్తున్నాడు. అలాగే అత‌డికి సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. నటన, దర్శకత్వంతో పాటు దేవగన్ ఫిల్మ్ మేకింగ్ ప‌రంగాను తెలివైన ఎంపిక‌ల‌తో ఆర్జిస్తున్నాడు. 2000లో అజయ్ దేవగన్ తన నిర్మాణ సంస్థ దేవగన్ ఫిల్మ్స్‌ని స్థాపించాడు. ఇందులో సినిమాల నిర్మాణంతో పాటు పంపిణీ విభాగం కూడా ప‌ని చేస్తోంది. అలాగే అజయ్ దేవగన్ ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని స్థాపించారు. NY VFXWaala విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. దేవ‌గ‌న్ న‌టించి నిర్మించిన `శివాయ్` కోసం 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డును గెలుచుకుంది.

ఓంకార, స్పెషల్ 26 , దృశ్యం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను నిర్మించిన‌ పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ కూడా అక్ష‌య్ దే. జాతీయ మీడియా క‌థ‌నం ప్ర‌కారం... దేవగన్ 1 లక్ష ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి ప్రొడక్షన్ హౌస్‌లో రూ. 2.8 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఇది 800శాతం లాభాల్లో ఉంది. మల్టీప్లెక్స్ చైన్ వ్యాపారంలోను దేవ‌గ‌న్ పెట్టుబ‌డులు పెట్టాడు. 2017లో మల్టీప్లెక్స్ చైన్, NY సినిమాస్‌ను స్థాపించారు. ఇది సింగిల్ స్క్రీన్‌ల ఆకర్షణను పునరుద్ధరించే లక్ష్యంతో ప‌ని చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవగన్ ఢిల్లీ NCR లో ఎన్.వై సినిమాస్ మొదటి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. దిల్లీ , గుర్ గ్రామ్, ముంబై, బెంగ‌ళూరు వంటి చోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌ని దేవ‌గ‌న్ కి ప్లాన్ ఉంది.

ముంబైలో కొత్త వాణిజ్య స్థ‌లాలు, నివాస స్థలాలను కొనుగోలు చేయడం ద్వారా తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్న అజయ్ దేవగన్ 2010లో స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. అజయ్ దేవగన్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏడిఐ అనే కంపెనీని స్థాపించాడు. సోలార్ ప్రాజెక్ట్ లోను అక్ష‌య్ పెట్టుబ‌డులు పెట్టాడు. 2013లో గుజరాత్‌లోని చరంకలోని అత్యాధునిక సోలార్ పార్క్‌లో అజయ్ దేవగన్ భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. సోలార్ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ నటుడు రోహా గ్రూప్ & నిర్మాత కుమార్ మంగత్‌తో కలిసి పనిచేశారు. భ‌విష్య‌త్ అంతా ఈ రంగానిదే. మొత్తం రూ. 5,000 కోట్ల పెట్టుబడితో మూడు నుంచి ఐదేళ్లలో 500 మెగావాట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని దేవ‌గ‌న్ తెలిపారు.

దేవ‌గ‌న్ ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వ‌హిస్తున్నాడు. తన భార్య కాజోల్, తల్లి వీణా దేవగన్‌తో కలిసి 2019లో ఎన్.వై ఫౌండేషన్స్ అనే ఛారిటీ ఫౌండేషన్‌ను స్థాపించారు. నిరుపేదలకు ఆహారం ఇవ్వడం నుండి పిల్లలకు చదువు చెప్పే వరకు దేవగన్ ఫౌండేషన్ అనేక సామాజిక కార్యకలాపాలతో ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంది. స్వ‌యం సేవ‌తో పాటు ప్ర‌జాసేవా అవ‌స‌ర‌మ‌ని దేవ‌గ‌న్- కాజోల్ దంప‌తులు న‌మ్ముతున్నారు.

Tags:    

Similar News