సీక్వెల్స్ తో సక్సెస్ మంత్రం వాళ్లకే సొంతం!
సీక్వెల్స్ తో హిట్ కొట్టడం అన్నది బాలీవుడ్ కే చెల్లింది. అందుకే 20-30 ఏళ్ల క్రితం హిట్ సినిమాల్ని కూడా తవ్వి తీసి వాటికి సీక్వెల్స్ చేస్తున్నారు.
సీక్వెల్స్ తో హిట్ కొట్టడం అన్నది బాలీవుడ్ కే చెల్లింది. అందుకే 20-30 ఏళ్ల క్రితం హిట్ సినిమాల్ని కూడా తవ్వి తీసి వాటికి సీక్వెల్స్ చేస్తున్నారు. లేటెస్ట్ హిట్ సినిమాలకు సీక్వెల్ ఎండింగ్ లో హింట్ ఇస్తూ వాటికి కొనసాగింపుగా పార్ట్ -2 లను తెరపైకి తేవడం ఎక్కువైంది. సీక్వెల్స్ అంటే ఒకప్పుడు నాలుగైదేళ్లు అయినా సమయం తీసుకునే వారు. కానీ ఇప్పుడంత సమయం తీసుకోవడం లేదు. హిట్ అయితే చాలా అదే బ్రాండ్ తో మార్కెట్ లోకి వచ్చే స్తున్నారు.
ఇటీవలే రిలీజ్ అయిన `భూల్ భులయ్య 3` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే శద్దాకపూర్ `స్త్రీ-2` అయితే ఏకంగా రికార్డులే నమోదు చేసింది. ఏకంగా 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఓస్టార్ హీరో వందల కోట్టు ఖర్చు పెడితే గానీ సాధ్యం కానిది శ్రద్దాకపూర్ దెయ్యం పాత్ర పోషించి రాబట్టింది. అలాగే `సింగం ఎగైన్` కి మిశ్రమ టాక్ వచ్చినా? కాప్ స్టోరీ కావడంతో బాగానే వర్కౌట్ అయింది.
దీంతో వచ్చే ఏడాది మరిన్ని సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ నటిస్తోన్న `వార్ -2` భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ చేతిలో అయితే చెప్పలేనన్ని సీక్వెల్స్ ఉన్నాయి. అక్షయ్ కుమార్ సక్సెస్ తో పనిలేకుండా కమిట్ అవుతున్నాడు. `రైడ్-2`,` సన్నాఫ్ సర్దార్ -2`,` `దేదే ప్యార్ దే-2` అజయ్ దేవగణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
`జాలీ ఎల్ ఎల్ బీ-3`,` హౌస్ ఫుల్ -5`,` వెల్కమ్ టుది జంగిల్` ఇన్ స్టాల్ మెంట్లు కూడా అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో రెడీ అవుతున్నాయి. బాఘీ-4, క్రిష్-4, ధూమ్-4, బ్రహ్మాస్త్ర-2 ఇలా చాలా సినిమాలు రెడీ అవుతు న్నాయి. వీటిలో చాలా సినిమాలు వచ్చే ఏడా పట్టాలెక్కనున్నాయి. క్రిష్, ధూమ్ లాంటి సిరీస్ లు షూటింగ్ పూర్తవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అందువల్ల వాటి రిలీజ్ కు కన్నీసం ఏడాదిన్నర అయిన సమయం పట్టొచ్చు.