బాలీవుడ్‌ పరిస్థితి మరీ ఇలా దిగజారిందేంటి పాపం

కరోనా కి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా బాలీవుడ్ పరిస్థితి

Update: 2023-07-25 02:30 GMT

ఒకప్పుడు బాలీవుడ్ సినిమా వస్తుంది అంటే మినిమం వంద కోట్ల వసూళ్లు నమోదు ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కరోనా కి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా బాలీవుడ్ పరిస్థితి మారింది. స్టార్‌ హీరోలు సైతం థియేట్రికల్‌ రిలీజ్ కి భయపడుతున్నారంటే అక్కడి ప్రేక్షకులు హిందీ సినిమాలను ఎంతగా తిరష్కరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

సౌత్‌ సినిమా లు వందల కోట్లు వసూళ్లు సాధిస్తూ ఉత్తర భారతంలో దూసుకు పోతూ ఉంటే... హిందీ సినిమాలు మాత్రం తేలిపోతున్నాయి. 2023 సంవత్సరం ఏడు నెలలు పూర్తి కాబోతుంది. ఇప్పటి వరకు అక్కడ నమోదు అయిన సక్సెస్ లు కేవలం మూడు. పఠాన్ ఒక్కటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోగా ఇతర రెండు సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్ ను దక్కించుకున్నాయి.

ఈ ఏడాదిలో సౌత్‌ సినిమాలు పలు ఉత్తర భారతంలో భారీ వసూళ్లు నమోదు చేశాయి. సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్‌ సినిమాలు కూడా నార్త్‌ లో కుమ్మేస్తున్నాయి. తాజాగా విడుదల అయిన హాలీవుడ్ ఓపెన్ హైమర్ సినిమా ఉత్తర భారతంతో పాటు సౌత్ ఇండియాలో కూడా భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వర్గాల వారికి కూడా షాకింగ్ గా నిలిచింది.

ఇప్పటికే దాదాపుగా 50 కోట్ల రూపాయల వసూళ్ల ను ఓపెన్‌ హైమర్ రాబట్టింది అనేది టాక్‌. మరో వారం రోజుల పాటు ఉత్తర భారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన బాలీవుడ్‌ సినిమాలతో పోల్చితే ఓపెన్‌ హైమర్ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ గా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

బాలీవుడ్‌ లో చిన్న హీరోలు.. పెద్ద హీరోలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో కూడా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. షారుఖ్ పఠాన్ సూపర్ హిట్ అయిన కారణంగా జవాన్ సినిమా పై అంచనాలు ఉన్నాయి. ఒక వేళ జవాన్ పరిస్థితి తలకిందులు అయితే షారుఖ్‌ కూడా ఓటీటీ రిలీజ్ వైపు చూసే అవకాశాలు లేకపోలేదు.

కరోనా తర్వాత హిందీ సినిమా ల పట్ల ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆసక్తి చూపడం లేదు. ఈ విషయం పలు సినిమాలు రిలీజ్ అయిన సందర్భంగా నిరూపితం అయింది. కొన్నాళ్ల తర్వాత పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి వస్తుందని అంతా భావించారు. కానీ హిందీ సినిమాలను ఉత్తరాది రాష్ట్రాల సినీ ప్రేమికులు లైట్ తీసుకున్నారు అనిపిస్తుంది. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News