బాలీవుడ్ సూపర్ స్టార్స్.. బిగ్ సక్సెస్ ఇస్తోంది మనోళ్ళే..

ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ సత్తా వరల్డ్ వైడ్ గా అందరికి తెలిసింది. దీనికి కారణం వారు చేస్తున్న సినిమాలని చెప్పొచ్చు

Update: 2024-07-03 05:30 GMT

ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే మాట వరల్డ్ వైడ్ గా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ లో సమానంగా పోటీ పడే టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ అయితే బాలీవుడ్ స్టార్స్ కి సూపర్ హిట్స్ ఇస్తున్నారు. అలాగే మన స్టార్ హీరోలు బాలీవుడ్ స్టార్స్ ని బీట్ చేస్తూ కలెక్షన్స్ ని అందుకుంటున్నారు.

ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ సత్తా వరల్డ్ వైడ్ గా అందరికి తెలిసింది. దీనికి కారణం వారు చేస్తున్న సినిమాలని చెప్పొచ్చు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సౌత్ దర్శకులతో మూవీస్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దం క్రితమే ఏఆర్ మురుగదాస్ బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో గజినీ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం చూసుకుంటే గత ఏడాది అట్లీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు.

సల్మాన్ ఖాన్ కూడా అట్లీతో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ ప్రభుదేవాతో వాంటెడ్ మూవీ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బిల్లా ఫేమ్ విష్ణువర్ధన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే ఏఆర్ మురుగదాస్ తో కొత్త సినిమాని ఎనౌన్స్ చేశాడు. సందీప్ రెడ్డి వంగా అయితే బాలీవుడ్ జెండా పాతేసాడు.

కబీర్ సింగ్ మూవీతో షాహిద్ కపూర్ కి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. గత ఏడాది యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ కి అతి పెద్ద సక్సెస్ ని అందించాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి-సిరీస్ మరో రెండు ప్రాజెక్ట్స్ కోసం సందీప్ రెడ్డి వంగాతో అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా కల్కి2898ఏడీతో నాగ్ అశ్విన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ మూవీలో ఓ విధంగా అమితాబ్ బచ్చన్ మరో హీరో అని చెప్పాలి.

Read more!

ప్రభాస్ క్యారెక్టర్ కూడా అమితాబ్ తో పోలిస్తే సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాబీ డియోల్ తో ఓ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. వీరందరి కంటే ముందుగానే రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు లాంటి స్టార్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం చక్రం తిప్పారు. స్టార్ హీరోలతో మూవీస్ చేసి సత్తా చాటారు. ఈ విధంగా బాలీవుడ్ స్టార్స్ కు మన సౌత్ దర్శకులు బిగ్ హిట్స్ ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సినిమాలు తీస్తారో చూడాలి.

Tags:    

Similar News

eac