శ్రీకాంత్ - రామ్ చరణ్ మధ్య బాండింగ్ ఇలా!
ఇప్పుడు చిరంజీవి, శ్రీకాంత్ తరం దాటి వాళ్ల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవిని ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ అన్నయ్య అని ఎంతో అభిమానంతో పిలుస్తాడు. తన అభిమాన హీరోగా చెబుతుంటాడు. చిరంజీవి సైతం శ్రీకాంత్ ని తమ్ముడుగా భావించి ఎంతో ప్రేమను చాటుతారు. పబ్లిక్ గా ఎన్నోసార్లు ఆ బాండింగ్ బయట పడింది. చిరంజీవి నటించిన సినిమాల్లో శ్రీకాంత్ భాగమయ్యాడు. నేటికి ఆ బాండింగ్ అలా కొనసాగుతుంది. ఇప్పుడు చిరంజీవి, శ్రీకాంత్ తరం దాటి వాళ్ల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమాల్లోనూ శ్రీకాంత్ నటిస్తున్నాడు. మరి చిరంజీవితో ఉన్నంత బాండింగ్ రామ్ చరణ్ తో ఉందా? అంటే అంతకు మించి తండ్రి తరహాలోనే తనయుడు అనురాగాలు పంచుతున్నాడని చెప్పొచ్చు. శ్రీకాంత్ ని ...రామ్ చరణ్ అన్నా అని ప్రేమతో పిలుస్తాడు అన్న సంగతి రివీల్ చేసాడు ఛార్మింగ్ స్టార్. ఇంత వరకూ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. తొలిసారి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.
అలా సీనియర్ నటులకు చరణ్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు? అన్నది మరోసారి బయట పడింది. చరణ్-శ్రీకాంత్ లు కలిసి `గోవిందుడు అందరి వాడేలే` లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ కలిసి సినిమా చేయలేదు. తాజాగా `గేమ్ ఛేంజర్` లో మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శంకర్ ఓ కొత్త లుక్ లో శ్రీకాంత్ ని ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతవరూ శ్రీకాంత్ కూడా శంకర్ సినిమాల్లో ఎన్నడు నటించలేదు.
అలా తొలిసారి శంకర్ తో కలిసి పనిచేస్తున్నారు. మంచి పాత్ర ఇచ్చినట్లు శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేసారు. ఆయన ఇలాంటి పాత్ర ఇస్తారని తాను ఊహించలేదని అన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు న్నట్లు తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉందీ సినిమా.