బాక్సాఫీస్ 2024: టాప్ 2లో దేవుడు దెయ్యమే..
ఈ ఏడాది ఇండియాలో ఏ ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువ హిట్ సినిమాలు రాలేదు. బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న మూవీస్ అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు
ఈ ఏడాది ఇండియాలో ఏ ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువ హిట్ సినిమాలు రాలేదు. బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న మూవీస్ అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఒక్క మలయాళీ ఇండస్ట్రీ మాత్రం అత్యధిక సక్సెస్ రేట్ కి కలిగి ఉంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు 100+ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో గట్టిగా చూసుకుంటే 5 బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేవని చెప్పాలి. అయితే ఈ ఏడాది వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ నుంచి వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ కనిపిస్తోంది.
ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 183.20 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరిగాయి. ఇండియన్ మైథాలజీ ఎలిమెంట్స్ తో సైన్స్ ఫిక్షన్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఓ విధంగా దైవంతో ముడిపడిన కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఇక సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ2 నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 83.45 కోట్ల గ్రాస్ మొదటి రోజు వసూళ్లు చేసింది. దెయ్యం హర్రర్ కామెడీ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కింది.
అంటే ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చి హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలు రెండు దేవుడు, దెయ్యం కాన్సెప్ట్ లతో ఉన్నవి కావడం విశేషమని చెప్పాలి. థర్డ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నిలిచింది. ఈ మూవీ 79.30 కోట్ల గ్రాస్ మొదటి రోజు కలెక్ట్ చేసింది. ఫస్ట్ డేట్ కలెక్షన్స్ పరంగా టాప్ 4లో ఇండియన్ 2 మూవీ నిలిచింది.
ఈ మూవీ 58.10 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఐదో స్థానంలో హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ 35.65 కోట్ల గ్రాస్ తో ఉంది. ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ బడే మియాన్ చోటే మియాన్ మూవీ నిలిచింది. ఈ సినిమాకి మొదటి రోజు 32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆగష్టు 15న రిలీజ్ అయిన చియాన్ విక్రమ్ తంగలాన్ ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా టాప్ 7లోకి వచ్చింది. ఈ మూవీ 26.15 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.
2024లో మొదటి రోజు అత్యధిక గ్రాస్ అందుకున్న సినిమాలివే..
కల్కి 2898ఏడీ - 183.20CR
స్త్రీ2 - 83.45CR
గుంటూరు కారం - 79.30CR
ఇండియన్ 2- 58.10CR
ఫైటర్ - 35.65CR
బడే మియాన్ చోటే మియాన్ - 32CR
తంగలాన్ - 26.15CR
హనుమాన్ - 24.50CR
టిల్లు స్క్వేర్ - 23.70CR
రాయన్ - 23.40CR
సైతాన్ - 21.75CR