బోయపాటి హై వోల్టేజ్ కాంబో.. అఫీషియల్!

ఇక స్కంద తర్వాత బోయపాటి బాలయ్యతో అఖండ సీక్వెల్ చేస్తున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి.

Update: 2024-01-26 13:22 GMT

టాలీవుడ్ మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను గత ఏడాది 'స్కంద' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. సినిమా కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా విషయంలో ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చాయి. ఇక స్కంద తర్వాత బోయపాటి బాలయ్యతో అఖండ సీక్వెల్ చేస్తున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి.


రీసెంట్ గా కోలీవుడ్ హీరో సూర్యతో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిందని టాక్ వినిపించింది. ఇక గత కొద్దిరోజులుగా బోయపాటి కథకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓకే చెప్పాడనే న్యూస్ కూడా వైరల్ అయింది. కానీ ఇప్పటివరకు బోయపాటి ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. ఎట్టకేలకు తాజాగా ఆ క్లారిటీ వచ్చేసింది. బోయపాటి లేటెస్ట్ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉండబోతోంది. ఇదే విషయాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు.


'మ్యాజికల్ రీ యూనియన్ మాస్ కాంబో' పేరుతో బోయపాటి శ్రీను - అల్లు అరవింద్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఉన్న ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే ఓ ఎలక్ట్రిఫైంగ్ అప్డేట్ రాబోతోందని వెల్లడించారు. అలాగే 'మ్యాసివ్ ఫోర్సెస్ స్టోర్మింగ్ వన్స్ అగైన్' అంటూ బోయపాటి, అల్లు అరవింద్ ల పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అల్లు అర్జున్ హీరోగా 'సరైనోడు' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

2016లో విడుదలైన ఈ చిత్రం ఆ సంవత్సరం టాలీవుడ్ లో రెండవ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాదు నిర్మాతగా అల్లు అరవింద్ కి మంచి లాభాలను తెచ్చి పెట్టింది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వీరి కాంబో సెట్ అవ్వడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించి నటీనటులతో పాటూ మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఈ ప్రాజెక్టులో హీరో ఎవరనే విషయమై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే చాలా మంది ఈ ప్రాజెక్టులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారని చెబుతున్నారు. మరి కొంతమంది అయితే కోలీవుడ్ హీరో సూర్య - బోయపాటి కాంబినేషన్ సెట్ అయిందని అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంతవరకు వేచి చూడాలి.


Tags:    

Similar News