బాలయ్య కంటే ముందే.. ఆ హీరోతో బోయపాటి?
ఓసారి అట్లీతో సినిమా కన్ఫర్మ్ అయిందని, మరోసారి నెక్స్ట్ త్రివిక్రమ్ తోనే సినిమా ఉంటుందని.. మధ్యలో బోయపాటి పేరు కూడా వినిపించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా 'పుష్ప 2' తర్వాత బన్ని చేయబోయే ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు వినిపించాయి.
ఓసారి అట్లీతో సినిమా కన్ఫర్మ్ అయిందని, మరోసారి నెక్స్ట్ త్రివిక్రమ్ తోనే సినిమా ఉంటుందని.. మధ్యలో బోయపాటి పేరు కూడా వినిపించింది. కానీ వీరిలో నెక్స్ట్ బన్నీతో సినిమా చేసేది ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. నిజం చెప్పాలంటే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఇప్పటికే బన్నీ కోసం కథ సిద్ధం చేశారు. అటు త్రివిక్రమ్ కూడా బన్నీ స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ పై అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చారు ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా బన్నీని కలిసి కథ చెప్పి ఓకే చేయించుకున్నారని తెలుస్తోంది.
బోయపాటి - బన్నీ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'సరైనోడు' ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో బన్నీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 'అలవైకుంఠపురంలో' ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా 'స్కంద' మూవీతో భారీ విమర్శలు అందుకున్న బోయపాటి ఈసారి బన్నీని దృష్టిలో ఉంచుకొని ఓ పవర్ఫుల్ స్ర్కిప్ట్ ని సిద్ధం చేశారట.
ఇటీవలే బన్నీని కలిసి కథ వినిపిస్తే ఆయన కూడా ఓకే చెప్పేసారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ సంస్థ తెరకెక్కించనుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలయ్యతో బోయపాటి సినిమా సైతం చర్చల దశలోనే ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. 2024 ఎన్నికల ముందే బోయపాటితో సినిమా చేద్దామనుకున్నా.. అది వర్కౌట్ కాలేదు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది చివర్లో బాలయ్యతో 'అఖండ' సీక్వెల్ ని బోయపాటి తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు బన్నీతో ప్రాజెక్టు ఓకే అయిందని టాక్. మరి వీరిలో బోయపాటి ఎవరితో సినిమా ముందు స్టార్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.