బోయపాటి ని వెంటాడుతోన్న జూనియర్ల సెంటిమెంట్!
ఆ రకంగా బోయపాటి ప్రకటన కొట్టేయడానికి లేదు. తొమ్మిది చిత్రాల్లో ఆరు విజయాలు అంటే ఆషామాషీ కాదు.
టెన్షన్ అంతా ఆన్ సెట్స్ లో ఉన్నప్పుడే! ఆప్ ది సెట్స్ కి వచ్చిన తర్వాత కాన్పిడెన్స్ తప్ప! మరో ఆలోచ న గానీ..భయంగానీ ఉండదని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. 'స్కంద' కల్ట్ జాతర సందర్భంగా కరీనంగర్ లో బోయపాటి ఈ వ్యాఖ్యలు చేసారు. ఇప్పటివరకూ సక్సెస్ లు తప్ప ఫెయిల్యూర్స్ పెద్దగా లేవు. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన తొమ్మిది సినిమాలు రిలీజ్ అయితే! వాటిలో ఆరు విజయాలున్నాయి.
ఆ రకంగా బోయపాటి ప్రకటన కొట్టేయడానికి లేదు. తొమ్మిది చిత్రాల్లో ఆరు విజయాలు అంటే ఆషామాషీ కాదు. ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన ఘనత ఆయన సొంతం. అయితే ఈ ఆరు విజయాల్లో ఐదు విజయాలు కేవలం సీనియర్ హీరోలతోనే సాధ్యమైంది. మరో విజయం యంగ్ హీరో తో దక్కించుకున్నారు. ఇక్కడే 'స్కంద 'విషయలో బోయపాటిని ఓ సెంటిమెంట్ వెంటాడుతున్నట్లు క నిపిస్తుంది.
రవితేజ.. వెంకటేష్.. బాలయ్యలకు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. అలాగే 'సరైనోడు'తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి 100 కోట్ల సినిమా అందించాడు. అయితే ఎన్టీఆర్ .. రామ్ చరణ్..సాయి శ్రీనివాస్ లకు మాత్రం ప్లాప్ చిత్రాలే అందించాడు. ఎన్టీఆర్ తో తీసిన 'దమ్ము'...చరణ్ తో తెరకెక్కించిన 'వినయ విధేయ రామ'...సాయి శ్రీనివాస్ తో చేసిన 'జయ జానకి నాయక' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే. అవన్నీ భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు. కానీ ప్రేక్షకాభిమానుల్ని మెప్పించడంలో విఫలమైనవి.
ఆ రకంగా నేటి జనరేషన్ హీరోలకు సక్సెస్ ఇవ్వడంలో బోయపాటి వెనుకబాటు తనం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ తో తెరకెక్కించిన 'స్కంద'! ఎలాంటి ఫలితం సాధిస్తుంది! అన్నది ఆసక్తిక రంగా మారింది. బోయపాటి ఇప్పుడా సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి. లేదా! 'సరైనోడు' లాంటి హిట్ ఇచ్చి తన భయం కేవలం సెట్స్ లో మాత్రమేనని మరోసారి నిరూపించగలగాలి. మరో రెండు రోజుల్లో 'స్కంద' రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.