కన్నడ క్రేజీ మూవీ తెలుగు ఓటీటీలో వచ్చేసింది చూశారా..!

ఈ సినిమా ను పెద్ద ఎత్తున ఓటీటీ లో ప్రేక్షకులు స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. థియేట్రికల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న బాయ్స్ హాస్టల్‌ ఓటీటీ లో కూడా మంచి ప్రదర్శణ కనబర్చుతోంది.

Update: 2023-11-10 05:34 GMT
కన్నడ క్రేజీ మూవీ తెలుగు ఓటీటీలో వచ్చేసింది చూశారా..!
  • whatsapp icon

ఒకప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీ పరిధి చాలా తక్కువగా ఉండేది. ఆ భాష చిత్రాలు కేవలం ఆ భాషలో మాత్రమే ఆడేవి. ఇతర భాషల సినిమాలు డబ్ అయినా కూడా కన్నడ భాష సినిమాలు మాత్రం చాలా తక్కువగా డబ్బింగ్ అయ్యేవి. కానీ ఇప్పుడు కన్నడ సినిమాలకు పాన్‌ ఇండియా రేంజ్‌ లో మంచి క్రేజ్ ఉంది.

కేజీఎఫ్‌, కాంతార తో పాటు ఇంకా పలు కన్నడ సినిమాలు తెలుగు, హిందీ, తమిళ్‌ భాషల ప్రేక్షకులను అలరించి భారీ వసూళ్లు నమోదు చేయడం జరిగింది. అదే కోవలో వచ్చిన చిత్రం 'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే'. ఈ సినిమా మొదట కన్నడం లో మాత్రమే విడుదల అయింది. కానీ అక్కడ సాధించిన విజయం అన్ని భాషల ప్రేక్షకులను ఆకర్షించి, అన్ని చోట్ల కూడా డబ్‌ అయింది.

తెలుగు లో బాయ్స్ హాస్టల్‌ పేరు తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు లో విడుదల అయిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఏవో కారణాల వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈటీవీ విన్‌ ఓటీటీ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు

కన్నడ వర్షన్‌ ను జీ5 లో స్ట్రీమింగ్‌ చేస్తూ ఉండగా, తెలుగు వర్షన్ మాత్రం ఈటీవీ విన్‌ యాప్ లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ప్రముఖ కన్నడ స్టార్‌ రక్షిత్‌ శెట్టి సమర్పణలో వచ్చిన ఈ సినిమా కు లోక్‌ నాథ్‌ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ను పెద్ద ఎత్తున ఓటీటీ లో ప్రేక్షకులు స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. థియేట్రికల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న బాయ్స్ హాస్టల్‌ ఓటీటీ లో కూడా మంచి ప్రదర్శణ కనబర్చుతోంది.

Tags:    

Similar News