నయనతార గురించిన బ్రహ్మరహస్యం?
నిజానికి నయనతార బెంగుళూరులో స్థిరపడిన ఒక సాధారణ మలయాళం మాట్లాడే ఇంట్లో మలయాళీ తల్లిదండ్రులకు జన్మించింది.
అగ్ర కథానాయిక నయనతార గురించి ఒక బ్రహ్మరహస్యం తెలిసింది. నయన్ పుట్టి పెరిగింది ఓ మలయాళ కుటుంబంలో అయినా కానీ, తాను మలయాళం పూర్తిగా అర్థం చేసుకోలేదు. తనకు తమిళం వచ్చినంతగా మరో భాష కూడా రాదు. తనకు ఉన్న భాష సమస్య కారణంగా ఓసారి సెట్లో చాలా ఇబ్బంది పడింది. ఓవైపు సీన్ చేస్తుంటే, సరిగా రావడం లేదు. తనకు దర్శకుడు మాట్లాడుతున్న మలయాళ భాష అస్సలు అర్థం కావడం లేదు. ఆమెకు భాష బాగా తెలియదు కాబట్టి నిజమైన భావోద్వేగాలను సృష్టించలేకపోయింది. ఓవైపు ఇంకా పర్ఫెక్షన్ కావాలని దర్శకుడు, హీరో మోహన్ లాల్ అడుగుతూనే ఉన్నారు. కానీ ఎందుకనో ఆ సీన్ చేయలేకపోయింది. తీవ్ర ఒత్తిడికి గురైంది.
చివరకు అదుపుతప్పి మోహన్‌లాల్‌పై విరుచుకుపడింది.. భాష అర్థం కానప్పుడు దానిని ఎక్స్ ప్రెషన్ లో ఎలా చూపించాలి? అంటూ ఎదురు ప్రశ్నించింది. చివరకు తన ముఖంలో నిరాశకు మోహన్‌లాల్ సహా ఇతరులు నవ్వుకున్నారు. ఆ సమయంలో నయనతార చాలా భయపడ్డానని తెలిపింది. చివరకు రెస్ట్ తీస్కో అమ్మా అని దర్శకుడు ప్యాకప్ చెప్పారట.
నిజానికి నయనతార బెంగుళూరులో స్థిరపడిన ఒక సాధారణ మలయాళం మాట్లాడే ఇంట్లో మలయాళీ తల్లిదండ్రులకు జన్మించింది. నయన్ నస్రానీ క్రిస్టియన్‌గా పెరిగారు. 7 ఆగస్టు 2011న చెన్నైలోని ఆర్యసమాజ్ ఆలయంలో నయనతార హిందూమతాన్ని స్వీకరించారు. ఆ తర్వాత తనకు హిందూ మతంలోకి మారినట్లు సర్టిఫికెట్ జారీ అయింది. ఆమె స్టేజ్ పేరు, నయనతార అధికారిక పేరుగా మారింది.
నయనతార లవ్ స్టోరి గురించి తెలిసిందే. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయన్ 2015లో నానుమ్ రౌడీ ధాన్‌లో కలిసి పనిచేసినప్పటి నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంట 9 జూన్ 2022న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అక్టోబరు 2022లో ఈ జంట సరోగసీ ద్వారా ఉయిర్ - ఉలగం అనే కవల పిల్లలు పుట్టినట్లు ప్రకటించారు. వారి కవల అబ్బాయిల పూర్తి పేరు ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్ - ఉలాగ్ దైవిక్ ఎన్ శివన్. ఈ పేర్లలో N అంటే వారి తల్లి నయనతార.