ఎంఎస్ చనిపోయే ముందు.. బ్రహ్మానందం ఎమోషనల్
ఎంఎస్ నారాయణ గురించి పలు ఆసక్తికర విషయాలను బ్రహ్మానందం షేర్ చేశారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేని సమయంలో ఎంఎస్ నారాయణను ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
నేడు బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటించిన 'బ్రహ్మ ఆనందం' సినిమా విడుదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గత రెండు వారాలుగా బ్రహ్మానందం మీడియాలో సందడి చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన సినిమా కావడంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటించారు. తండ్రి, కొడుకు అయిన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌లు ఈ సినిమాలో తాత మనవడి పాత్రల్లో నటించారు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో ఎంఎస్ నారాయణ ఒకరు అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.
ఎంఎస్ నారాయణ గురించి పలు ఆసక్తికర విషయాలను బ్రహ్మానందం షేర్ చేశారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేని సమయంలో ఎంఎస్ నారాయణను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ సమయంలో ఒక చిట్టీలో బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉందని రాసి కూతురుకు ఇచ్చారు. ఆ విషయాన్ని తనకు చెప్పిన సమయంలో గోపీచంద్ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. విషయం తెలిసిన తర్వాత ఎవరికి చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్లి పోయాను. ఆసుపత్రిలో ఎంఎస్‌ను కలిశాను. నన్ను చూసిన సమయంలో ఎంఎస్ కన్నీల్లు పెట్టుకున్నాడు. నా చేయి గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. ఆ క్షణంను నేను ఎప్పటికీ మరచిపోలేను. డాక్టర్లతో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు బతికించండి అన్నాను. తిరిగి నేను కారులో షూట్‌కి వెళ్లాను.
కారులో షూట్‌కి వెళ్తున్న సమయంలోనే ఎంఎస్ చనిపోయినట్లు వార్త తెలిసింది. ఎంఎస్ చనిపోయే ముందు నా చేయి పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న ఘటన ఎప్పటికీ మరచిపోలేను. ఎంఎస్ కామెడీ యాంగిల్ చాలా విభిన్నంగా ఉంటుంది. అతడు కామెడీ చేస్తున్నట్లు ఉండదు. కానీ నవ్వు తెప్పిస్తుంది. ఆయనతో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు, ఇచ్చే పంచ్ డైలాగ్స్‌ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఇండస్ట్రీలో ఎంఎస్ నారాయణ లేని లోటును ఎవరు భర్తీ చేయలేరు. బ్రహ్మానందంతో ఆయన చేసిన సినిమాలు ఎన్నో మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
బ్రహ్మానందం చాలా కాలం తర్వాత నటించిన సినిమా కావడంతో బ్రహ్మ ఆనందం సినిమాపై అంచనాలు పెరిగాయి.. సినిమాకు వసూళ్లు ఎలా ఉంటాయి అనేది చూడాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందంను సినిమాల్లో పెద్దగా చూడకున్నా రెగ్యులర్గా మీమ్స్‌లో చూస్తున్నాం. కనుక ఆయన సినిమాలు చేయడం లేదు అనే బాధ పెద్దగా లేదు. మంచి పాత్రలతో వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ బ్రహ్మానందం మరోసారి క్లారిటీ ఇచ్చారు.