బ్రహ్మి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన గేమ్ ఛేంజర్..!

రామ్ చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది.

Update: 2025-02-16 06:06 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు 400 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మించిన సినిమా అది. ఈ సంకాంతికి భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా రిజల్ట్ ఏంటన్నది తెలిసిందే. రామ్ చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. ఐతే ఈ సినిమా గురించి శంకర్ పై చాలా కంప్లైంట్ లే ఉన్నాయి.

శంకర్ ఈ సినిమా కోసం దాదాపు 5 గంటల రష్ సిద్ధం చేశాడట. అందులో రెండు గంటల 50 నిమిషాల రన్ టైం ని ఫైనల్ గా కట్ చేశారు. ఐతే మిగిలిన రష్ లో చాలా సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ సినిమాలో తన సీన్స్ గురించి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం స్పందించారు. గేమ్ ఛేంజర్ సినిమాలో మీరు చాలా తక్కువ కనిపించారని ఒక రిపోర్టర్ అడగా మీకు కనిపించింది తక్కువ కానీ నేను చేసింది ఎక్కువ పాత్రే అని అన్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్ గా కనిపించారు. సినిమాలో హీరోయిన్ దగ్గరకు వెళ్లినప్పుడు ఒక్క సీన్ లో బ్రహ్మానందం అలా కనిపిస్తారు. ఐతే అదే కాదు బ్రహ్మి చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆయన మీద చాలా సీన్స్ షూట్ చేసినట్టు ఉన్నారు. కానీ అదంతా సినిమాలో పెట్టలేదు. బ్రహ్మి చెప్పిన ఈ ఆన్సర్ తో ఆయన ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో ఎడిటింగ్ కూడా పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. బ్రహ్మానందం సీన్సే కాదు సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా మిస్ అయినట్టుగా తెలుస్తుంది. సినిమా రష్ ఎక్కువ అవ్వడం వల్లే ఈ సమస్య ఏర్పడింది. ఐతే శంకర్ వర్కింగ్ స్టైలే అంత అయినా గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం అది చాలా ఇంపాక్ట్ కలిగేలా చేసిందని చెప్పొచ్చు. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ రెండు సినిమాలతో ఒకే రకమైన ఫలితాన్ని అందుకున్న శంకర్ భారతీయుడు 3 తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. ఇక బ్రహ్మానందం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తనయుడు రాజా గౌతం తో కలిసి బ్రహ్మ ఆనందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Tags:    

Similar News