సెకండ్​ వీకెండ్​లోనూ 'బ్రో' జోరు.. అంతా ఫ్యామిలీ ఆడియెన్సే

క్లైమాక్స్​ సీన్స్​, ఫ్యామిలీ బాండింగ్ అండ్​ ఎమోషనల్ సీన్స్​కు ఫ్యామిలీ ఆడియెన్స్​ను బాగా కనెక్ట్ అవుతున్నారట.

Update: 2023-08-05 11:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' ఇంకా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. మొదట్లో కాస్త మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకున్నా ఫస్ట్ వీకెండ్​లోనూ రూ.100 కోట్ల వసూళ్ళను అందుకుంది. ఇప్పుడు రెండో వీకెండ్​లోనూ అదే హవాను చూపిస్తోంది.

సాధారణంగా మొదటి వీకెండ్ తర్వాత ఏ సినిమా అయినా కాస్త జోరు తగ్గుతుంది. సినిమా మంచి హిట్​ టాక్​ను అందుకుంటే గానీ.. రెండో వీకెండ్​లో థియేటర్లు కళకళలాడుతాయి. ఇప్పుడు 'బ్రో' విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా టికెట్స్ ఆన్​లైన్​ బుకింగ్స్​ చాలా జోరుగా జరుగుతున్నాయట. బాగా సాలిడ్ రెస్పాన్స్ వస్తున్నాయని తెలిసింది.

జనరల్​గా పవన్ సినిమా అంటే ఆయన అభిమానులతోనే థియేటర్లన్నీ ఎక్కువగా నిండిపోతాయి. కానీ ఈ సారి మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వారంలో అంతా ఫ్యామిలీ ఆడియెన్స్​ బాగా కనిపిస్తున్నారని తెలిపాయి. క్లైమాక్స్​ సీన్స్​, ఫ్యామిలీ బాండింగ్ అండ్​ ఎమోషనల్ సీన్స్​కు ఫ్యామిలీ ఆడియెన్స్​ను బాగా కనెక్ట్ అవుతున్నారట.

పవన్ పవర్ ప్యాక్డ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్​కు తమన్​ బ్యాక్​గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్​​, త్రివిక్రమ్ షార్ప్​ డైలాగ్స్.. ఈ రేంజ్​కు రెస్పాన్స్​కు ముఖ్య కారణం. అలానే 'తమ్ముడు', 'జల్సా' సినిమాల్లోని సాంగ్స్​​ వచ్చినప్పుడు థియేటర్లు.. అభిమానుల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోతున్నాయని అంటున్నారు. 'బ్రో' థీమ్ సాంగ్ అయితే గూస్ బంప్స్​ తెప్పిస్తోందట.

వీటన్నింటికీ తోడు.. సాయి తేజ్ మెచ్యూర్​ యాక్టింగ్​, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ పెర్​ఫార్మెన్స్​, 'మై డియర్ మార్కండేయ' సాంగ్​లో ఊర్వశి రౌతేలా స్పెషల్ అప్పియరెన్స్​, సాయి తేజ్ తల్లి పాత్రలో రోహిణి, వెన్నెల కిశోర్, అలీ రెజా, రాజా తదితరుల నటన కూడా బాగుండడంతో రెండో వీకెండ్​లోనూ సినిమాకు కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా తరలివస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు 8 రోజుల్లో వరల్డ్ వైడ్​గా రూ. 63.62 కోట్ల షేర్‌, రూ. 106.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయని తెలిసింది.

Tags:    

Similar News