బ్రో నిర్మాత.. ఇదేమి వార్నింగ్ బాబోయ్!
మొదట కాస్త నార్మల్ గానే రియాక్ట్ అయిన అంబటి రాంబాబు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమా కలెక్షన్స్ చెప్పి మరి డిజాస్టర్ అని అన్నారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మొట్టమొదటి మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కేవలం ఒకే ఒక్క సీన్ కారణంగా రాజకీయాల్లో కూడా చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. శ్యాంబాబు అనే పేరుతో తన క్యారెక్టర్ ను పెట్టి స్పూఫ్ చేశారు అని వైసిపి నాయకుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఊహించని స్థాయిలో సీరియస్ అయ్యారు.
మొదట కాస్త నార్మల్ గానే రియాక్ట్ అయిన అంబటి రాంబాబు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమా కలెక్షన్స్ చెప్పి మరి డిజాస్టర్ అని అన్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ అలాగే మిగతా సినిమా ప్రముఖులకు కూడా ఆయన ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు చేశారు.
అంతేకాకుండా సినిమాపై పెట్టిన పెట్టుబడుల మీద అలాగే పవన్ కళ్యాణ్ కు ఏ తరహాలో రెమ్యునరేషన్ ఇచ్చారు అనే విషయంలో కూడా ఆయన అనుమానాలు వచ్చే విధంగా ఆరోపణలు చేస్తూ ఈడి అధికారులను కూడా కలవడానికి వెళుతుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇక ఆయన ఇచ్చిన వార్నింగ్స్ పై కూడా సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఫైనల్ గా చిత్ర నిర్మాత TG విశ్వప్రసాద్ కూడా ఆయనకు హెచ్చరికలు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రో సినిమాలను నిర్మించిన విశ్వప్రసాద్ అంబటి రాంబాబు చేసిన కామెంట్లకు స్పందిస్తూ వాటిని తాను అసలు సీరియస్ గా తీసుకోను అని ఒకవేళ వాటిని సీరియస్ గా తీసుకుంటే మాత్రం మరొకలా ఉంటుంది అని నవ్వుతూనే ఆయన చాలా పవర్ ఫుల్ గా హెచ్చరికలు చేసినట్లుగా అనిపిస్తోంది.
అంతేకాకుండా తనకు చాలా పవర్ఫుల్ లీగల్ టీం కూడా ఉంది అని ఆ రూట్ లో వెళితే మాత్రం అలా కామెంట్ చేసిన వారిని అంతకంటే కిందకి దించగలను అని కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం కూడా వైరల్ అవుతుంది. ఇక టీజీ విశ్వ ప్రసాద్ చేసిన కామెంట్స్ కు మళ్లీ అంబటి రాంబాబు రియాక్ట్ అవతారా లేదా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది.