సుమ వారసుడి కోసం మెగా సపోర్ట్

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ 'బబుల్ గమ్' అనే సినిమాతో వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసింది

Update: 2023-11-23 07:50 GMT

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ 'బబుల్ గమ్' అనే సినిమాతో వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, హబీబీ అనే సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరేపు ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.


యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై కేవలం ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి మరో సాంగ్ ని విడుదల చేశారు. 'ఇజ్జత్' అంటూ సాగే ఈ పాటని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయడం విశేషం. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్ మోడ్ లో సాగింది.

ఈమధ్య సోషల్ మీడియాలో ర్యాప్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో మూవీ టీం దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇజ్జత్ సాంగ్ రిలీజ్ చేసింది.హైదరాబాది ర్యాప్ సాంగ్ తరహాలో ఉన్న ఈ పాటలో రోషన్ తన ఎనర్జీతో అదరగొట్టాడు. ముఖ్యంగా కొన్ని పోర్షన్స్ లో డాన్స్ కూడా ఇరగదీసాడు. పాటలో ర్యాప్ మూమెంట్స్ సాంగ్ కి మంచి హై ఇచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ కంపోజ్ చేయగా హరి లిరిక్స్ రాసి పాడారు.

హైదరాబాదీ స్లాంగ్ లో క్యాచీ లిరిక్స్ తో ఉన్న ఈ ర్యాప్ సాంగ్ రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సాంగ్ లో ఉన్న హుక్ స్టెప్స్ ఇన్ స్టా రీల్స్ లో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది. సుమ కొడుకు రోషన్ కి ఇది డెబ్యూ మూవీనే అయినా టీజర్, సాంగ్స్ లో అతన్ని చూస్తుంటే ఎక్కడా ఆ ఫీలింగ్ రాలేదు.

యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ చాలా ఈజ్ తో చేశాడు. మొత్తంగా బబుల్ గమ్ నుంచి రిలీజ్ అయిన ఈ లేటెస్ట్ సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Full View
Tags:    

Similar News