బుచ్చి బాబుకి భయం పట్టుకుందా..?

డైరెక్టర్ గా తొలి సినిమా హిట్ కొడితే వచ్చే క్రేజ్ వేరేలా ఉంటుంది. అందుకు తగినట్టుగానే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ గా బుచ్చి బాబుకి సూపర్ క్రేజ్ ఏర్పడింది

Update: 2025-03-01 04:00 GMT

డైరెక్టర్ గా తొలి సినిమా హిట్ కొడితే వచ్చే క్రేజ్ వేరేలా ఉంటుంది. అందుకు తగినట్టుగానే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ గా బుచ్చి బాబుకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు ఆయన పేరు నిలబడతాడని ఫిక్స్ అయ్యారు. ఉప్పెనతో మెగా మేనల్లుడిని ఇంట్రడ్యూస్ చేసి అతనికి బంపర్ హిట్ అందించాడు. ఒక అందాల భామని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు. అంతా బాగానే ఉంది. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు పెద్ద గేం ప్లాన్ ఆడుతున్నాడు.

రెండో సినిమా ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోనే చేస్తున్నాడు. చరణ్ తో బుచ్చి బాబు సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ ముందు కాస్త షాక్ అయినా ఉప్పెన అవుట్ పుట్ చూసి ఓకే అనుకున్నారు. ఐతే చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి బాబు సినిమా చేస్తున్నాడు. అందుకే ఆ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. సినిమా కథ రాసుకుని చరణ్ ని ఒప్పించి సెట్స్ మీదకు వెళ్లే దాకా బాగున్నా ఇప్పుడు బుచ్చి బాబుకి భయం పట్టుకుందని తెలుస్తుంది.

మెగా ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. గేం ఛేంజర్ డిజప్పాయింట్ చేయడంతో అంచనాలన్నీ RC 16 మీదే పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమాను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయాల్సి ఉంటుంది. బుచ్చి బాబు కూడా అదే ఆలోచనతో సినిమా ఎంతో ఫోకస్ తో చేస్తున్నాడు.

RC16 లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. సినిమా కథ విని ఆయన ఓకే చేశారు. ఐతే ఉప్పెనలో శేషారాయణం తరహాలో ఆర్సీ 16లో శివన్న పాత్ర ఉంటుందని టాక్ నడుస్తుంది. మొత్తానికి బుచ్చి బాబు మాత్రం చరణ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో చేస్తున్నాడు. ఈ సినిమాతో అతను హిట్ కొడితే మాత్రం అతన్ని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్చే ఛాన్స్ ఉంది. మరి చరణ్ సినిమాను బుచ్చి బాబు ఏం చేస్తున్నాడో చూడాలి. సినిమా సెట్స్ నుంచి వస్తున్న అప్డేట్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి.

Tags:    

Similar News