రౌడీ స్టార్‌కి ఐకాన్ స్టార్ థాంక్స్
ఇంత బిజీ టైమ్ లో విజయ్ దేవరకొండకి ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ఎక్కడ చూసినా పుష్ప 2 గురించి మాట్లాడుతూ ఉన్నారు, సోషల్ మీడియాలోనూ పుష్ప 2 గురించే ఎక్కువగా పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన సోషల్ మీడియా పేజ్‌లో విజయ్ దేవరకొండకు థాంక్స్ చెబుతూ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంత బిజీ టైమ్ లో విజయ్ దేవరకొండకి ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ఏంటి, అసలు బన్నీ థాంక్స్ చెప్పడంకు కారణం ఏంటి అనేది సైతం అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ టీ షర్ట్స్‌ను అల్లు అర్జున్‌కి పంపించడం జరిగింది. ఆ టీ షర్ట్ పై రౌడీ బ్రాండ్‌లోగో తో పాటు పుష్ప అక్షరాలు సైతం డిజైన్ చేసి ఉన్నాయి. దాంతో ఆ టీ షర్ట్స్‌ను అల్లు అర్జున్ షేర్ చేసి తనకు ఈ బహుమానం పంపినందుకు థాంక్స్ అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు. మై స్వీటెస్ట్ బ్రదర్ విజయ్ దేవరకొండ, నీ యొక్క ప్రేమకు కృతజ్ఞతలు అంటూ లవ్ ఈమోజీలను అల్లు అర్జున్ షేర్ చేయడం జరిగింది. రౌడీ స్టార్ గతంలోనూ బన్నీకి ఇలా రౌడీ గూడ్స్‌ను పంపించడం, ఆ సమయంలోనూ ఇలాగే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.
ఇప్పుడు పుష్ప 2 తో బిజీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ద కనబర్చుతూ విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు చెప్పడంతో అల్లు అర్జున్ గురించి అంతా పాజిటివ్‌గా మాట్లాడుకుంటూ ఉన్నారు. విజయ్ దేవరకొండతో అల్లు అర్జున్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో పలుసార్లు వీరిద్దరు కలిసిన ఫోటోలు వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ యొక్క రౌడీ వేర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందు ఉంటారు. ఇప్పుడు మరోసారి రౌడీ వేర్‌ను తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా చూపించడం ద్వారా విజయ్ దేవరకొండపై తనకు ఉన్న అభిమానంను చెప్పకనే చెప్పారు.
అల్లు అర్జున్ నటించి పుష్ప 2 సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఏకంగా 11500 స్క్రీన్స్‌లో విడుదల చేయబోతున్నారు. మొదటి రోజు ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మొదటి వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధించి, లాంగ్ రన్‌లో రూ.2000 కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టడం ఖాయం అంటూ ప్రతి ఒక్కరు ధీమాతో చెబుతున్నారు. బాక్సాఫీస్‌ను షేర్ చేసి ఎన్నో ఏళ్లుగా టాప్‌లో ఉన్న దంగల్, బాహుబలి 2 సినిమాలను తర్వాత స్థానాలకు చేర్చే సత్తా పుష్పరాజ్‌కి మాత్రమే ఉందని, సుకుమార్ ఆ స్థాయిలో పుష్ప 2 ను రూపొందించారని అంటున్నారు.