కిరణ్ అబ్బవరం అందుకే ఓడిపోలేదు: బన్నీవాస్

"ఈ సినిమాను ప్రత్యేకంగా అభినందించాలి అని అనిపించింది, అందుకే ఈ వేడుకకు వచ్చాను. నేను ఎంతో కథలు విన్నాను, ఎన్నో కథలపై అంచనాలు పెట్టుకున్నాను.

Update: 2024-11-08 15:10 GMT

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన "క" సినిమా ఘన విజయం సాధించింది. ఇక సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ "క" టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తన మనసుకు నచ్చిన సినిమాల విజయోత్సవాలకు మాత్రమే హాజరవుతానని చెప్పారు.

"ఈ సినిమాను ప్రత్యేకంగా అభినందించాలి అని అనిపించింది, అందుకే ఈ వేడుకకు వచ్చాను. నేను ఎంతో కథలు విన్నాను, ఎన్నో కథలపై అంచనాలు పెట్టుకున్నాను. కానీ 'క' సినిమా క్లైమాక్స్‌ నా అంచనాలకు మించి ఉంది. స్క్రీన్‌ప్లేలో ఎలాంటి పొరపాటు లేదు, చాలా గొప్ప స్క్రీన్‌ప్లే అని చెప్పవచ్చు," అని బన్నీ వాస్ అన్నారు.

క్లైమాక్స్‌ గురించి ప్రస్తావిస్తూ, "ఎంత గొప్ప రచయిత అయినా ఈ క్లైమాక్స్‌ను ఊహించగలిగితే వారిని దేవుళ్లతో సమానంగా భావించాలి. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. టీమ్ మొత్తం కృషితో ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అందరికీ శుభాకాంక్షలు. నిర్మాత చింతా గోపాల్‌ రెడ్డి మంచి దైర్యం చేసి ఈ సినిమాను నిర్మించడం అభినందనీయం. బడ్జెట్ విని నాకు నిజంగానే ఆశ్చర్యం కలిగింది," అంటూ నిర్మాత దైర్యాన్ని ప్రశంసించారు.

కిరణ్ అబ్బవరం సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అవకాశం సృష్టించుకున్నాడు. అతని కృషి, పట్టుదలతోనే ఈ రోజు విజయం సాధించాడు. ఎప్పుడు సినిమాను వదలకుండా పోరాటం చేసిన కిరణ్‌కు విజయం దక్కింది. అతని ఇన్స్పిరేషన్ చూసి మరెంతో మంది ప్రేరణ పొందుతారు. కష్టం చేసి ముందుకు సాగితే విజయం తప్పదు అనే విషయాన్ని అతని ప్రస్థానం చూపించింది. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేసినప్పుడే కిరణ్‌ ఎప్పుడు సినిమాను వదల్లేదు... అని కిరణ్ అబ్బవరం పై అభిమానం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, సినిమా విజయంతో పాటు బడ్జెట్‌పై నమ్మకంతో ముందుకు వెళ్లిన వంశీ నందిపాటిని ప్రశంసిస్తూ, "వంశీ నా మనసుకు ఎంతో దగ్గరయిన వ్యక్తి. రేట్ చెప్పకుండానే సినిమా కొనుగోలు చేసిన వంశీ, తన నమ్మకాన్ని నిజం చేసి చూపించాడు," అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో "క" టీమ్‌కు మరిన్ని విజయాలు రావాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News