ఆ ఛాన్స్ లేదన్న బన్నీ వాసు..!
అల్లు అరవింద్ కి బన్నీ వాసు మీద గురి ఉంటుంది. అందుకే గీతా ఆర్ట్స్ బ్యానర్ ని ఆయన చేతిలో పెట్టారు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. గీతా ఆర్ట్స్ అన్నది అల్లు అరవింద్ స్థాపించిన బ్యానర్.. ఆ బ్యానర్ నుంచి అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఐతే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో మీడియం రేంజ్, లో బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చారు. ఐతే బన్నీ ఫ్రెండ్ అయిన వాసు అల్లు అర్జున్ తో పాటుగా గీతా ఆర్ట్స్ లో కూడా భాగం అవుతూ వచ్చాడు. అల్లు అరవింద్ కి బన్నీ వాసు మీద గురి ఉంటుంది. అందుకే గీతా ఆర్ట్స్ బ్యానర్ ని ఆయన చేతిలో పెట్టారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య బన్నీ వాసు గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చేస్తారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీనిపై బన్నీ వాసు స్పందించారు. గీతా ఆర్ట్స్ 2 లో తెరకెక్కించే సినిమాల విషయంలో ఫైనల్ డెసిషన్ అల్లు అరవింద్ గారిదే అని.. ఐతే కొన్ని కథల విషయంలో తనకు అల్లు అరవింద్ గారికి కూడా వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయని ఐతే ఈ మధ్యనే అలాంటి కథల గురించి ఒక నిర్ణయానికి వచ్చామని అన్నారు బన్నీ వాసు.
అల్లు అరవింద్ గారి ఒపీనియన్ ఎలా ఉన్నా తనకు నచ్చిన కథలను గీతా ఆర్ట్స్ 2 లోనే నిర్మించే అవకాశం కూడా తనకు ఇచ్చారని బన్నీ వాసు వెల్లడించారు. ఇక మీదట తనకు బాగా నచ్చిన కథలను కంపల్సరీగా తెరకెకించే తీరుతా అంటున్నారు బన్నీ వాసు. ప్రస్తుతం బన్నీ వాసు తండేల్ సినిమాతో వస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జతకట్టిన ఈ సినిమా విషయంలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఆడియన్స్ కి బాగా ఎంగేజ్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ తోనే తండేల్ సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చేలా చేశారు. శుక్రవారం రిలీజ్ కాబోతున్న తండేల్ సినిమా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ హిట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి సినిమా విషయంలో మేకర్స్ పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. తండేల్ సినిమా బన్నీ వాసు కెరీర్ లో కూడా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాకు దాదాపు 90 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్టు టాక్.