బాహుబలి-3.. అసలు నిజమెంత?

అదే సమయంలో రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అప్ కమింగ్ మూవీ కంగువా నిర్మాత కేఈ జ్ఞానవేల్‌.. ఓ ఇంటర్వ్యూలో బాహుబలి-3 గురించి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-19 07:52 GMT

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు పార్టులు.. వరల్డ్ వైడ్ గా ఎలాంటి హిట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్, అనుష్క లీడ్ రోల్స్ లో జక్కన్న తీసిన ఆ రెండు సినిమాలు.. టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాయి. అదే సమయంలో బాహుబలి మూడో పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం రాజమౌళి కూడా బాహుబలి-3 ఉందని అన్నారు. కానీ క్లారిటీగా చెప్పలేదు.

బాహుబలి రాజ్యం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుందని మాత్రం తెలిపారు. ఆ తర్వాత బాహుబలి యానిమేషన్ సిరీస్ ను రిలీజ్ చేశారు. అయితే బాహుబలి-3 వస్తుందో లేదో అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. అదే సమయంలో రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అప్ కమింగ్ మూవీ కంగువా నిర్మాత కేఈ జ్ఞానవేల్‌.. ఓ ఇంటర్వ్యూలో బాహుబలి-3 గురించి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. గత వారం బాహుబలి మేకర్స్‌ తో చర్చించానని, పార్ట్‌ 3 ప్లాన్‌ చేసే పనిలో వారు ఉన్నారని తెలిపారు.

దీంతో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బాహుబలి-3 కోసం వెయిటింగ్‌ అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్ పోస్టులు పెడుతుండగా.. కొందరు వేరేలా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బాహుబలి-3 కష్టమేనని చెబుతున్నారు. పార్ట్-3 సాధ్యం కాదని అంటూ వివరణ కూడా ఇస్తున్నారు. రాజమౌళికి చేయాలనే ఆలోచన ఉన్నా ఇప్పుడు అన్నీ సెట్ అవ్వడం కష్టమని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీతో బిజీగా ఉన్నారు.

ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చేస్తున్నారు రాజమౌళి. 2026-2027 మధ్యలో SSMB 29 సినిమాను రిలీజ్ చేసే ఆయన అవకాశం ఉంది. ఆ తర్వాత బాహుబలి-3 మొదలు పెట్టాలనుకుంటే.. పూర్తి అయినప్పుడు 2031 అయిపోతుందని నెటిజన్లు చెబుతున్నారు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదని, క్యాస్టింగ్ లుక్స్ మారిపోతాయని, ఏజ్ పెరిగిపోతుందని అంటున్నారు. క్రేజ్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని.. కామెంట్లు పెడుతున్నారు.

ముఖ్యంగా ఒకే ప్రాంఛైజీపై లాంగ్ టైమ్ ఇంట్రెస్ట్ తక్కువ మందిలోనే ఉంటుందని చెబుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత మూడో పార్ట్ తీసుకొస్తే వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేమని అంటున్నారు. కథ పరంగా కూడా సవాళ్లు విసిరే అంశాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి బాహుబలి 3 జరిగే పని కాదని అంటున్నారు. అలా మొత్తంగా కంగువా నిర్మాత చేసిన వ్యాఖ్యలు బేస్ లేస్ గా ఉన్నాయని.. ప్రమోషన్స్ కోసమే అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News