సందేహాలు? సందిగ్దాలు? అసలేం జరిగేను!
ట్రైలర్ కి వస్తోన్న రెస్పాన్స్ బట్టి డే వన్ లో రికార్డు కష్టమని మహా అయితే 50 కోట్ల వరకూ రాబట్టొచ్చు అని అంటు న్నారు. మరోవైపు బ్యాన్ 'పుష్ప-2' అని ఓ వర్గం నెట్టింట రచ్చ చేస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప-2' భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న పాట్నాలో జరిగిన ట్రైలర్ ఈవెంట్ జనాల్ని చూసి అంతా స్టన్ అయిపోయారు. నార్త్ లో పుష్పకి ఇంత క్రేజ్ ఉందా? అని మరోసారి అంతా చర్చించుకున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ వందల కోట్లు జరిగిందని ప్రచారం లో ఉంది. థియేట్రికలర్ రన్ లో 1000 కోట్లకు పైగానే రాబడుతుందని అంచనాలు తెరపైకి వస్తున్నాయి.
నార్త్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లను పెద్ద ఎత్తున బ్లాక్ చేసి పెట్టారు. దీంతో డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన 'ఛావా' సినిమా సైతం ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు.మరోవైపు ఏకంగా షారుక్ ఖాన్ ఫస్ట్ డే వసూళ్ల రికార్డునే బన్నీ తిరగరాస్తాడా? అనే గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. షారుక్ జవాన్ చిత్రం తొలి రోజు 65 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ రికార్డునే పుష్ప చెరిపేస్తుందంటే? రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఓ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ నిర్వహించిన పోల్ ప్రకారం 60-70 శాతం మంది షారుక్ వసూళ్లను అధిగమిస్తుందని ఓట్ వేసారు. మిగతా 30-40 శాతం మంది అది సాధ్యపడదని ఓటు వేసారు. మునుపటి కంటే పుష్ప-2కి బజ్ తగ్గుతుందని కొంతమంది అభిప్రాయపడుతుంటే? పెరిగిందని మరికొంత మంది రాసుకొస్తున్నారు. యూఎస్ లో కొన్ని గంణాకాల్ని సైతం సరిపోల్చుతూ డేవన్ రికార్డు సాధ్యం కాదని చెప్పే వారు ఇంకొంత మంది.
ట్రైలర్ కి వస్తోన్న రెస్పాన్స్ బట్టి డే వన్ లో రికార్డు కష్టమని మహా అయితే 50 కోట్ల వరకూ రాబట్టొచ్చు అని అంటు న్నారు. మరోవైపు బ్యాన్ 'పుష్ప-2' అని ఓ వర్గం నెట్టింట రచ్చ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ కూడా సినిమాపై పడుతుందని భావిస్తున్నారు. అందుకు ధీటుగా అల్లు ఆర్మీ రంగంలోకి దిగి పనిచేస్తుంది. మరేం జరుగుతుందన్నది చూడాలి.