రజనీకాంత్..కమల్ కి పోటీనిచ్చిన ఒకే ఒక్కడు కెప్టెన్!
నటుడిగా ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ .. విశ్వనటుడు కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులకే పోటీగా నిలిచారు. ఇక విజయ్ కాంత్ దర్శకుడిగా 'విరుధగిరి' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
కెప్టెన్ విజయ్ కాంత్ 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయ్ రాజ్ అళగర్ స్వామి. కానీ సినిమాల్లోకి వెళ్లిన తర్వాత విజయ్ కాంత్ గా పేరు మార్చుకున్నారు. తల్లిదండ్రులు కె.ఎన్ అళగర్ స్వామి-ఆండాళ్ అజగర్ స్వామి. విజయ్ కాంత్ కు భార్య ప్రేమల త..ఇద్దరు కుమారులు కలరు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ 'సగప్తం'..'మధుర వీరన్' చిత్రాల్లో నటించారు.
ఇక విజయ్ కాంత్ నట ప్రస్థానం 27 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. ఆయన తొలి చిత్రం 'ఇనిక్కుమ్ ఇలమై' 1979 లో రిలీజ్ అయింది. ప్రతి నాయకుడి పాత్రతతోనే ప్రేక్షకులకు పరిచమయ్యారు. నాటి నుంచి 2015 వరకూ నిర్విరామంగా సినిమాలు చేసారు. మలయాళం హీరోల తరహాలోనే విజయ్ కాంత్ కూడా మూడు షిప్ట్ ల్లో పనిచేసేవారు. ఆరంభంలో పెద్దగా విజయాలు అందుకోలేదు. అదే సమయంలో ఎస్. ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'దూరతు ఇడి మళక్కం', 'సత్తం ఓరు ఇరుత్తైరై' అనే సినిమాలో మంచి విజయాలు అందుకున్నారు.
మొత్తంగా ఆయన నట జీవితంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక 1984 లో ఆయన నటించిన 18 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం ఓ చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ నటుడు అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయలేదు. 20 కి పైగా పోలీస్ అధికారి పాత్రల్లో నటించారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు విజయ్ కాంత్ పెట్టింది పేరుగా చరిత్ర సృష్టించారు. చివరిగా ఆయన నటించిన చిత్రం 'సగప్తం'. అది 2015 లో రిలీజ్ అయింది. ఇక ఆయన సినిమాల ద్వారా ఏదో ఒక సందేశం తప్పకుండా ఇచ్చేవారు.
దేశభక్తి సినిమాలైనా...గ్రామీణ నేపథ్యం గల కథలైనా..డ్యూయల్ రోల్స్ అయినా అందరికంటే ముందుం డేవారు. ఇక ఆయనలో మరో ప్రత్యేకమైన లక్షణం ఉంది. అందరి నటుల్లా పారితోషికం ముందు తీసుకునేవారు కాదుట. తన నిర్మాతలేవరైనా ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే తీసుకున్న పారితో షికం కూడా తిరిగిచ్చేసేవారు. ఆయన కెరీర్ మొత్తం కేవలం కోలీవుడ్ కే అంకితమిచ్చారు. సినిమాలన్నీ అక్కడే చేసారు. వాటిని తెలుగు...హిందీ భాషల్లో డబ్ చేసేవారు. విజయ్ కాంత్ ఆ రకంగా తెలుగులో ఎంతో పేరు తెచ్చుకున్నారు.
తమిళ నటుడైనా కెప్టెన్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. కేవలం డబ్బింగ్ సినిమాలతోనే అంత పేరు సంపాదించడం ఆయనకే చెల్లింది. ఆయన వందవ చిత్రం 'కెప్టెన్ ప్రభాకరన్' బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో చరిత్ర సృష్టించింది. నటుడిగా ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ .. విశ్వనటుడు కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులకే పోటీగా నిలిచారు. ఇక విజయ్ కాంత్ దర్శకుడిగా 'విరుధగిరి' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
అందులో ఆయనే హీరో. అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 1994 లో తమిళనాడు స్టేడ్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు( ఎంజీఆర్ పురస్కారం).. 2001 లో కళైమామణి అవార్డు(తమిళనాడు ప్రభుత్వం) అందుకున్నారు. ఇంకా 2001 లో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డ్ సహా పలు పురస్కారాలు అందుకు న్నారు. ఇక రాజకీయాల్లోనూ ఆయన ముద్ర వేసారు. 2005 లో డీఎండీకే పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి దిగారు. 2006..2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.