నయనతారపై ముంబయిలో కేసు నమోదు

ఇందులోని కొన్ని సన్నివేశాలు తమ మత భావాల్ని కించపరిచేలా ఉన్నాయని.. లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ముంబయికి చెందిన ఒకరు పోలీసుల్ని ఆశ్రయించారు.

Update: 2024-01-09 04:48 GMT

ఈ మధ్యన నయనతార నటించిన 'అన్నపూరిణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్' మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని తెలుగులోకి డబ్ చేశారు. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తి వ్యక్తమవుతోంది. నయనతార లీడ్ రోల్ పోషించిన ఈ మూవీలో కొన్ని సన్నివేశాల్ని చూసినప్పుడు జీర్ణించుకోవటం కష్టంగా మారుతుంది. మరీ ముఖ్యంగా.. క్లెమాక్స్ లో చికెన్ బిర్యానీని వండే వేళలో.. ఆమె ప్రార్థన చేసే సీన్లలోని లాజిక్ తర్వాత.. ఈ మూవీపై నెగిటివ్ ఫీలింగ్ కలిగేలా చేసిందన్న మాట బలంగా వినిపించింది.

ఈ మూవీలో నయనతార బ్రాహ్మణ యువతిగా నటించారు. ఆమె ముస్లిం వ్యక్తిని ప్రేమించటం లాంటివి సమస్య కానప్పటికీ.. శుద్ధ బ్రాహ్మణ యువతిగా ఉంటూ.. ఆ పాత్ర వ్యవహరించే తీరుపై బోలెడన్ని అభ్యంతరాలు.. వాదనలకు తావిచ్చేలా ఆ పాత్రను దర్శకుడు నీలేశ్ క్రిష్ణ డిజైన్ చేయటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. వివాదం చెలరేగేలా ఉన్న ఈ మూవీలో మిస్ అయిన పాయింట్.. ఎవరి మతాచారాలు వారివి.. వారిని గౌరవించటం చాలా ముఖ్యం. అలాంటిది వారిని చిన్నబుచ్చేలా సన్నివేశాల్ని రాసుకోవటం ఏ మాత్రం సరికాదు.

ఈ మూవీలో అదే తప్పు జరిగింది. ఇందులోని కొన్ని సన్నివేశాలు తమ మత భావాల్ని కించపరిచేలా ఉన్నాయని.. లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ముంబయికి చెందిన ఒకరు పోలీసుల్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇందులో లీడ్ రోల్ పోషించిన నయనతార.. జై.. నీలేశ్ లతో పాటు నిర్మాతలు జతిన్ సేథీ.. ఆర్ రవీంద్రన్.. పునీత్ గోయెంకాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వివాదంతో ఈ సినిమాను చూసే వారు పెరుగుతారని.. వాదనలు.. ప్రతివాదనలతో వాతావరణం వేడెక్కటం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News