చైతన్య-శోభిత: I LOVE YOU చెప్పిందెవరు?
సాధారణంగా వివాహం తర్వాత ఇలాంటి విషయాలపై పెద్దగా ఎవరూ స్పందించరు.
శోభిత ధూళిపాళ యువ సామ్రాట్ నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నాగచైతన్య ఎంతో ఇష్టపడి ప్రేమించి శోభితను తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఈ పెళ్లి తర్వాత అక్కినేని కుటుంబంలో కొత్త సంతోషం తోడైంది. ఈ నేపథ్యంలో శోభిత వివాహం తర్వాత జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చైతన్యతో తన స్నేహం, ప్రేమ, పెళ్లి అన్ని విషయాలు ఎంతో ఓపెన్ గా పంచుకుంటుంది.
సాధారణంగా వివాహం తర్వాత ఇలాంటి విషయాలపై పెద్దగా ఎవరూ స్పందించరు. ఇంటర్వ్యూలు ఇవ్వరు. కానీ శోభిత ప్రత్యేకంగా చైతన్యతో తన బంధం గురించి రివీల్ చేస్తూ ఎంతో ముచ్చటగా అలరిస్తుంది. ఇదంతా ఒకే మరి మొదట ప్రపోజ్ చేసింది? ఎవరు అన్నది మాత్రం శోభిత రివీల్ చేయలేదు. ఐలవ్ యూ చెప్పింది ఎవరు? అన్నది మాత్రం గోప్యంగా ఉంచుతుంది. గోవా పర్యటనలో భాగంగా పెళ్లి ప్రపోజల్ వచ్చినట్లు తెలిపింది.
కానీ ముందుగా ఐలవ్ చెప్పి బుట్టలో వేసింది ఎవరు? చైతన్య..శోభితనా? అన్నది మాత్రం సస్పెన్స్. శోభిత కోసం చైతన్య హైదరాబాద్ నుంచి తరుచూ ముంబైకి వెళ్లేవాడు. తొలిసారి చైతన్యను కలిసినప్పుడు అతడు నీలిరంగు సూట్ లో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. తాను మాత్రం ఎరుపు రంగు దుస్తులు ధరించినట్లు గుర్తు చేసుకుంది. ఇక్కడో ప్రత్యేక కారణం చెప్పాలి. ప్రేమికుల మధ్య తొలి కలయిక జీవితాంతం గుర్తుండాలి అంటారు.
ఓ సందర్భంలో అమల...నాగార్జునను ఇరికించే ప్రయత్నం చేసారు. ఓ షోలో ఇద్దరు తొలిసారి కలుసుకున్నప్పుడు? ఎవరు ఏ రంగు దుస్తులు వేసుకున్నారో చెప్పాలంటూ అమల పట్టు బట్టారు. దీంతో నాగార్జున కాసేపు నీళ్లు నమిలినా చివరకు గుర్తు చేసుకుని సరైన సమాధానం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత చైతన్యకు శోభిత నుంచి ఇలాంటి ప్రశ్నలు తప్పవు. అందుకే ఇలా ఓ సారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది.