చెయ్యి పట్టుకుని ఛాలెంజ్ దాటించాడు : నాగ చైతన్య

తండేల్ సక్సెస్ మీట్ కి కింగ్ నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.

Update: 2025-02-11 17:18 GMT

నాగ చైతన్య సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా సూపర్ హిట్ కాగా ఈ సక్సెస్ ని పురస్కరించుకుని నేడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. తండేల్ సక్సెస్ మీట్ కి కింగ్ నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఫ్యాన్స్ ని మెప్పించారు తండేల్ హీరో నాగ చైతన్య. ముందుగా మైక్ అందుకున్న నాగ చైతన్య అభిమానులందరికీ నమస్కారం తాత గారు అన్నట్టుగా అభిమాన దేవుళ్లందరికీ నమస్కారం అన్నారు.

తండేల్ సినిమా ఎంతో ఇష్టమైన కష్టమైన జర్నీ.. చందు, కార్తీ ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత శ్రీకాకుళం వెళ్లాక ఎంత కష్టం ఉందో అర్థమైంది. కష్టంతో పాటు రెస్పాన్సిబిలిటీ ఉందో అర్థమైందని అన్నారు నాగ చైతన్య. అక్కడ మత్స్యకారులను కలుసుకుని వాళ్ల లైఫ్ గురించి తెలుసుకున్నాం.. శ్రీకాకుళం యాస తో చందు ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశారు.

ఒక యాక్టర్ గా ఇన్ని క్వాలిటీస్ ఇన్ని అవకాశాలు ఉన్న రోల్ రావడం చాలా అరుదుగా దొరుకుతాయి. అందరు కష్టపడతారు. నాకు ఈ కష్టంలో ఒక బాధ్యత కనిపించింది. అందుకే ఫెయిల్ అవ్వకూడదు అనుకుని సక్సెస్ చేయాలనే ప్రయత్నంలో ఈ జర్నీ మొదలు పెట్టా అన్నారు. ఈ జర్నీలో నా టీం ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు నాగ చైతన్య.

అంతేకాదు సినిమా రిలీజ్ రోజు 7న సినిమా టాక్ ఆనందాన్ని ఇచ్చింది. సినిమా రిలీజ్ ముందు భయం వేసింది.. ఏ సినిమాకు లేని భయం ఈ సినిమాకు ఉంది. నాకు చందు, వాసు, అరవింద్ గారు ధైర్యం ఇచ్చారని అన్నారు నాగ చైతన్య. వాసు ఐతే ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేస్తారు.. 100 కోట్లు కొడతారని కమిట్మెంట్ ఇచ్చాడు. అరవింద్ గారు నీ కెరీర్ బెస్ట్ అవుతుందని అన్నారు. 100 లవ్ ఎంత బూస్ట్ ఇచ్చిందో తండేల్ కూడా అంతే ఇస్తుందని అనుకున్నా అదే జరిగిందని అన్నారు నాగ చైతన్య.

ఇక డైరెక్టర్ చందు మొండేటి గురించి చెబుతూ.. నువ్వే నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావ్.. ఆ ఛాలెంజ్ ఎలా దాటాలో నువ్వే నా చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తావ్.. థాంక్ యు సో మచ్.. ఈ తండేల్ సినిమాలో నువ్వు నా పక్కన ఉండి నడిపించావ్ అన్నారు నాగ చైతన్య. అందరు క్లైమాక్స్, జైలు సీన్ గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉందని అన్నారు చైతన్య.

ఇక కెరీర్ లో ఎంతో కష్టపడాలి.. ఎన్నో కొత్త పాత్రలు చేయాలన్న బూస్టింగ్ వచ్చింది. తెలుగు సినిమా ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాను తప్పకుండా ఆదరిస్తారని చూపించారని నాగ చైతన్య అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ సినిమాను పూర్తిగా అర్థం చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు. అక్కినేని ఫ్యామిలీకి సూపర్ హిట్స్ ఇచ్చారని అన్నారు నాగ చైతన్య.

Tags:    

Similar News