శోభిత న్యూ డిసిషన్.. ఇలాంటి నిర్ణయం ఊహించనేలేదు
శోభిత ధూళిపాళ కెరీర్‌లో హాట్ అండ్ బోల్డ్ ఇమేజ్‌తోనే గుర్తింపు తెచ్చుకుంది. హిందీ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ నుండి ఆమె నటన కంటే గ్లామర్ యాంగిల్ గురించి ఎక్కువగా చర్చించుకున్నారు.
టాలీవుడ్‌లో బ్యూటీఫుల్ జోడిగా గుర్తింపుని అందుకుంటున్న చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి వార్త ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరూ సింపుల్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. చాలా కాలంగా వీరి రిలేషన్‌పై ఊహాగానాలు వస్తున్నా వాటిపై పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ పెళ్లి వార్తతో ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చేసి స్టన్ అయ్యేలా చేశారు. ఇక పెళ్లైన రెండు నెలలకే శోభిత తీసుకున్న కొత్త నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
శోభిత ధూళిపాళ కెరీర్‌లో హాట్ అండ్ బోల్డ్ ఇమేజ్‌తోనే గుర్తింపు తెచ్చుకుంది. హిందీ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ నుండి ఆమె నటన కంటే గ్లామర్ యాంగిల్ గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. అలాగే ఆమె కండోమ్ లాంటి బోల్డ్ కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది. అలాగే మరోవైపు టాలీవుడ్‌లో కూడా మేజర్ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ పెళ్లి తర్వాత మాత్రం ఆమె ఈ బోల్డ్ ఇమేజ్‌ను పూర్తిగా వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేటెస్ట్ టాక్.
ఇటీవల జరిగిన తండేల్ సక్సెస్ మీట్‌లో ఈ మార్పు మరింత స్పష్టమైంది. గ్లామర్ లుక్‌లో కనిపించే శోభిత సంప్రదాయమైన చీరకట్టుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకూ గ్లామర్ షోలో స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆమె, అకస్మాత్తుగా ఇలా సంప్రదాయంగా మారిపోవడమే కాకుండా, కెరీర్‌లో కూడా కొత్త గైడ్‌లైన్ ఫాలో కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మార్పుకు కారణం నాగ చైతన్యతో ఆమె జీవితం సంబంధమైన బాధ్యత కావొచ్చని భావిస్తున్నారు. అక్కినేని కుటుంబంలో వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ షోతో ముందుకు వెళ్లలేదు. ఈ కారణంగానే శోభిత కూడా తన కెరీర్‌లో గ్లామర్ లెవెల్ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె నటనలో మెరుగులు పెట్టి, కంటెంట్ బేస్డ్ మూవీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అనుకుంటోంది.
అక్కినేని ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆమె తాజా ప్రాజెక్టులపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నిర్ణయంతో కొత్త కథానాయికగా మారబోతుందా, లేక తనదైన స్టైల్‌లోనే ముందుకు వెళ్తుందా అనేది చూడాలి. కానీ, ఈ మార్పు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.