బెయిల్ మీద బయటకు వచ్చే వేళలో బన్నీకి ఊహించని అనుభవం

ఇబ్బందికర పరిస్థితుల్లోనూ తమ మీద చూపే అభిమానాన్ని ఓపిగ్గా భరించాల్సి ఉంటుంది సెలబ్రిటీలకు.. ప్రముఖులకు. తాజాగా అలాంటి అనుభవమే పుష్ప అలియాస్ అల్లు అర్జున్ కు ఎదురైందని చెబుతున్నారు.

Update: 2024-12-15 08:16 GMT

ఇబ్బందికర పరిస్థితుల్లోనూ తమ మీద చూపే అభిమానాన్ని ఓపిగ్గా భరించాల్సి ఉంటుంది సెలబ్రిటీలకు.. ప్రముఖులకు. తాజాగా అలాంటి అనుభవమే పుష్ప అలియాస్ అల్లు అర్జున్ కు ఎదురైందని చెబుతున్నారు. తొక్కిసలాట కేసులో తనను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులను.. భార్యను ధైర్యంగా ఉండాలని.. తనకేమీ కాదని భరోసా ఇచ్చి.. ఇలా వెళ్లి అలా వస్తానన్నట్లుగా చెప్పిన అల్లు అర్జున్ అందుకు భిన్నంగా జైలుకు వెళ్లాల్సి రావటం తెలిసిందే.

నాంపల్లి కోర్టు పద్నాలుగురోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో చంచలగూడ జైలుకు అల్లు అర్జున్ తరలించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు.. హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేయటంతో అల్లు అర్జున్ విడుదలకు మార్గం సుగమైంది. రికార్డు స్థాయిలో కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే అరెస్టు.. విచారణ ఎదుర్కోవటం.. ఆరోగ్య పరీక్షలు. కోర్టు విచారణ.. రిమాండ్.. హైకోర్టులో మధ్యంతర బెయిల్ తో విడుదల కావటం లాంటివి చకచకా జరిగాపోయాయి.

హైకోర్టును అందాల్సిన బెయిల్ పత్రాలు సాంకేతిక అంశాల కారణంగా ఆలస్యం కావటంతో శనివారం ఉదయం ఆరు గంటల (సుమారు) వ్యవధిలో విడుదలయ్యారు కానీ లేకుంటే రాత్రి తొమ్మిది గంటలకు ముందే రిలీజ్ కావాల్సింది. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ను నిద్ర లేపిన జైలు సిబ్బంది.. ఆయన బెయిల్ పత్రాలు వచ్చేశాయని.. బయటకు రావాల్సిందిగా కోరారు.

బెయిల్ పత్రాల మీద సంతకాలు పూర్తి చేసి.. బయటకు వెళ్లే వేళలో.. అప్పటివరకు ఉగ్గ పట్టుకొని ఉన్న జైలు సిబ్బంది అల్లు అర్జున్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపినట్లుగా చెబుతున్నారు. ఆ టైంలో తన మీద అభిమానాన్ని ప్రదర్శిస్తూ.. తనతో ఫోటోలు తీసుకోవటానికి ఉత్సాహం ప్రదర్శించిన జైలు సిబ్బంది పలువురికి ఓపిగ్గా ఫోటోలు ఇచ్చిన అల్లు అర్జున్ తర్వాత జైలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జైలుకు వెళ్లి రికార్డు వేళలో బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా జైలు సిబ్బంది అభిమానాన్ని సొంతం చేసుకోవటం బన్నీకే సాధ్యమైందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News