కేబీసీ లో ఆ కారణంతో 7 కోట్లు పోగొట్టుకున్న కంటెస్టెంట్..

అయితే అతను పాపులర్ అయింది కోటి రూపాయలు గెలుచుకున్నందుకు కాదు.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..

Update: 2024-09-26 06:19 GMT

'కౌన్ బనేగా కరోడ్పతి' ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా ఎటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదట్లో హిందీలో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాం ఆ తర్వాత అన్ని భాషల్లో కూడా విస్తరించింది. ఇక ఈ ప్రోగ్రాం కి బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం తాజాగా ఈ షో కి సంబంధించిన 16వ సీజన్ జరుగుతోంది.. ఇందులో 22 సంవత్సరాల కుర్రవాడు కోటి రూపాయలు గెలుచుకొని సెన్సేషన్ సృష్టించాడు. అయితే అతను పాపులర్ అయింది కోటి రూపాయలు గెలుచుకున్నందుకు కాదు.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..

చంద్ర ప్రకాష్ అనే 22 సంవత్సరాల కుర్రవాడు 'కౌన్ బనేగా కరోడ్పతి' ప్రోగ్రాం 16వ సీజన్ లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే ఇందులో మరొక విశేషం ఏమిటంటే 7 కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ రిస్కు తీసుకోవడం ఇష్టం లేక గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. బుధవారం నాడు జరిగిన ఎపిసోడ్ లో ఈ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది.

చంద్ర ప్రకాష్ ను. ’ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. శాంతినివాసం అనే అరబిక్ పేరుతో ఆ నగరంలో ఓ పోర్టు ఉంది’అని కోటి రూపాయలకు అమితాబ్ ప్రశ్నను సంధించారు. దీనికి ఇచ్చిన ఆప్షన్స్

ఎ. సోమాలియా, బి. ఒమన్, సి. టాంజానియా, డి.

బ్రూనై. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం డబల్ డిప్ లైఫ్ లైన్ ఉపయోగించుకున్న చంద్ర ప్రకాష్ ఆప్షన్స్ సి.

టాంజానియాను తన సమాధానంగా ఎంచుకున్నారు. లక్కీగా అది కరెక్ట్ ఆన్సర్ కావడంతో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అలా ఈ సీజన్ మొత్తానికి తొలిసారి కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తిగా చంద్రప్రకాష్ నిలిచాడు.

కోటి రూపాయలతో పాటుగా అతను ఒక కారును కూడా బహుమతిగా అందుకోవడం విశేషం. ఇక అనంతరం గేమ్ ని కంటిన్యూ చేసిన చంద్రప్రకాష్ 7 కోట్ల రూపాయలకు కాను’1587 లో ఉత్తర అమెరికాలోని ఇంగ్లీష్ దంపతులకు జన్మించిన మొదటి బిడ్డ ఎవరు?’అనే ప్రశ్నను ఎదుర్కొన్నాడు. అయితే అప్పటికే లైఫ్ లైన్లు అన్ని పూర్తి కావడం ఆన్సర్ పై స్పష్టత లేకపోవడంతో అతను గేమ్ ని వదులుకున్నాడు. తీరా ఆట పూర్తయ్యాక అమితాబ్ సరదాగా నువ్వు అనుకున్న ఆన్సర్ ఏమిటో చెప్పు అంటే..ఆప్షన్ ఎ. వర్జనీయా డేర్ అని అతను సమాధానం ఇచ్చాడు. విచిత్రం ఏమిటంటే అతను చెప్పిన ఆ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఈ వార్త వైరల్ కావడంతో అందరూ అతను కాస్త రిస్క్ తీసుకొని ఉంటే కోటి రూపాయలకు బదులు ఏడు కోట్లు వచ్చేవి అని భావిస్తున్నారు.

Tags:    

Similar News