స్టార్‌ హీరోయిన్స్‌ కి దక్కని రికార్డ్‌ చాందిని చౌదరికి..!

ఒకే హీరోయిన్ నటించిన రెండు మూడు సినిమాలు ఒకే వారంలో విడుదల అయిన సందర్భాలు గతంలో చాలానే జరిగాయి

Update: 2024-06-13 07:07 GMT

ఒకప్పుడు స్టార్‌ హీరోలు రెండు మూడు నెలలకు ఒక సినిమా చొప్పున, నెలకు రెండు సినిమాల చొప్పున విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకే హీరోయిన్ నటించిన రెండు మూడు సినిమాలు ఒకే వారంలో విడుదల అయిన సందర్భాలు గతంలో చాలానే జరిగాయి.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్కో హీరోయిన్‌ ఒక్కో సినిమా ఆఫర్‌ దక్కించుకోవడానికి చాలా టైమ్‌ వెయిట్‌ చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఒకే సారి రెండు మూడు సినిమాలు చేస్తున్నా కూడా ఒకే సారి ఆ సినిమాలు వచ్చే పరిస్థితి లేదు. కానీ తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి అరుదైన ఘనత దక్కబోతుంది.

అప్పట్లో సాధ్యం అయిన ఘనత ఇప్పుడు చాందిని సొంతం అయ్యింది. రేపు అంటే జూన్ 14న చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమాలు మ్యూజిక్ షాప్‌ మూర్తి మరియు యేవం విడుదల అవ్వబోతున్నాయి. ఒకే రోజు రెండు సినిమాలో చాందిని రాబోతుండటం కచ్చితంగా అరుదైన రికార్డ్‌.

ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌ లో హీరోయిన్ గా అవకాశాలు రావడమే గగనంగా మారింది. అలాంటిది ముద్దుగుమ్మ చాందిని చౌదరి ఒకే సారి రెండు సినిమాలు చేయడం, ఆ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రాబోతుండటం కలిసి వచ్చే అంశం అన్నట్లుగా మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

గామి సినిమాతో ఇటీవల డీసెంట్‌ సక్సెస్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ చాందిని చౌదరి త్వరలోనే మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కలర్‌ ఫోటో సినిమాతో హీరోయిన్ గా వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. మీడియం రేంజ్ హీరోలకు ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ అన్నట్లుగా మారింది. అందుకే ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయిలో సినిమాలు చేస్తుంది.

Tags:    

Similar News