కింగ్ నాగార్జున‌తోనూ సెంచ‌రీ కొట్టించేది అత‌డే!

దీంతో చైత‌న్య సెంచ‌రీ కొట్ట‌డం దాదాపు లాంఛ‌న‌మే. వంద కోట్ల పోస్ట‌ర్ ఎప్పుడు ప‌డుతుందా? అని అక్కినేని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Update: 2025-02-15 09:45 GMT

అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌డానికి ఇంకెంతో దూరంలో లేడు. ఇప్పటికే `తండేల్` 90 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. స్టిల్ వ‌సూళ్లు ఇంకా స్థిరంగా కొన‌సాగుతున్నాయి. దీంతో చైత‌న్య సెంచ‌రీ కొట్ట‌డం దాదాపు లాంఛ‌న‌మే. వంద కోట్ల పోస్ట‌ర్ ఎప్పుడు ప‌డుతుందా? అని అక్కినేని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

కాస్త ఆల‌స్య‌మైనా పోస్ట‌ర్ ప‌డ‌టం మాత్రం ఖాయ‌మే. అందులో ఎలాంటి డౌట్ లేదు. `తండేల్` సెంచ‌రీ కొట్టిన త‌ర్వాత భారీ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేయాల‌ని రెడీ అవుతున్నారు. ఇదంతా ఒకే. మ‌రి కింగ్ నాగార్జున సెంచ‌రీ కొట్టేదెప్పుడు? అంటే అది కూడా చందు మొండేటి చేతుల్లోనే ఉంది. ఇటీవ‌లే ఓ ఈవెంట్ లో నాగార్జున చందు తో సినిమా చేయాల‌ని ఉంద‌ని ఓపెన్ అయ్యారు. దీనికి చందు కూడా ఎంతో సంతోషించారు.

నాగ్ స‌ర్ తో ప‌నిచేసే అవకాశం తాను అడ‌గ‌కుండానే వ‌చ్చింద‌న్న సంతోషం క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో అక్కినేని అభిమానులు కూడా కింగ్ తో చందు ఓ సినిమా చేయాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. మ‌న్మ‌ధుడిని సైతం వంద కోట్ల క్ల‌బ్ లో కూర్చోబెట్టాల్సిన బాధ్య‌త చందు తీసుకోవాలంటున్నారు. నాగార్జున ఇంత వ‌రకూ పాన్ ఇండియా సినిమాలు చేయ‌లేదు. రీజ‌న‌ల్ మార్కెట్ ని బేస్ చేసుకునే సినిమాలు చేసారు.

చందు మాత్రం కార్తికేయ‌, తండేల్ అంటూ రెండు పాన్ ఇండియాలు చేసి స‌క్సెస్ అయ్యాడు. పాన్ ఇండియా క‌థ‌లు రాయ‌గ‌ల స‌మ‌ర్దుడు చందు. ఈ నేప‌థ్యంలో నాగార్జున తో కూడా ఓ పాన్ ఇండియా సినిమా తీస్తే? సెంచ‌రీ కొట్ట‌డం పెద్ద విష‌యం కాద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. కేవ‌లం నాగ‌చైత‌న్య‌తోనే కాకుండా అప్పుడ‌ప్పుడు నాగార్జున‌, అఖిల్ ని కూడా ట‌చ్ చేయాలంటూ కోరుతున్నారు. మ‌రి చందు ఏమంటాడో?

Tags:    

Similar News