దేవిశ్రీ ఎంత స్ట్రిక్టో చెప్పిన దర్శకుడు
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్‌తో వ్యవహారం కొంచెం పద్ధతిగా ఉంటుందని అంటారు. కొన్ని విషయాల్లో దేవి పర్టికులర్‌గా ఉంటాడని, తనకు తాను గీసుకున్న హద్దులను చెరిపివేయడానికి ఇష్టపడడని చెబుతారు.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్‌తో వ్యవహారం కొంచెం పద్ధతిగా ఉంటుందని అంటారు. కొన్ని విషయాల్లో దేవి పర్టికులర్‌గా ఉంటాడని, తనకు తాను గీసుకున్న హద్దులను చెరిపివేయడానికి ఇష్టపడడని చెబుతారు. చాలా కమిటెడ్‌గా పని చేస్తాడని పేరున్న దేవి.. ఏదైనా విషయంలో హర్ట్ అయితే ఎలా ఉంటుందో కూడా తనతో పని చేసేవాళ్లకు తెలుసు. ‘పుష్ప-2’ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం వేరే సంగీత దర్శకులను సంప్రదించడంపై దేవి ఎంత బాధ పడ్డాడో ఆ సినిమా చెన్నై ఈవెంట్లో స్పష్టంగా అర్థమైపోయింది. ఇక లేటెస్ట్ మూవీ ‘తండేల్’ విషయంలోనూ దేవి హర్ట్ అయిన విషయం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వయంగా దర్శకుడు చందూ మొండేటి ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘తండేల్’లో ఇంకో మంచి పాట కూడా ఉందని.. కానీ రిలీజ్ ముంగిట సినిమా నిడివి తగ్గించే ప్రయత్నంలో ఆ పాటను తీసేయాల్సి వచ్చిందని చందూ తెలిపాడు. దీంతో దేవి హర్ట్ అయినట్లు చందూ తెలిపాడు. ఐతే రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు సినిమాలో యాడ్ చేద్దామని అంటే దేవిశ్రీ అందుకు ఒప్పుకోలేదని చందూ వెల్లడించాడు. దేవి ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో.. హర్ట్ అయితే అంత కఠినంగా ఉంటాడని చందూ తెలిపాడు. పేరు తెలియని అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా వచ్చి ఒక సలహా చెప్పినా తీసుకుంటాడని, ఇగో ఉండదని.. కానీ హర్ట్ అయితే ఎవరు చెప్పినా వినడని చందూ చెప్పాడు. సినిమాలోంచి తీసేసిన పాట ద్వితీయార్ధంలో హీరో జైల్లో ఉన్న సందర్భంగా వస్తుందని.. దాని ద్వారా కథను కూడా కొంత నడుస్తుందని.. అది సినిమాలో ఉంటే ఎమోషన్ ఇంకా బాగా క్యారీ అయ్యేదని చందూ అభిప్రాయపడ్డాడు. కానీ రిలీజ్ తర్వాత ఈ పాట యాడ్ చేయడానికి ఒప్పుకోలేదని.. ఒకసారి నో అన్నాక అలాగే ఉండిపోనివ్వాలని అన్నాడని చందూ తెలిపాడు. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి దేవితో మాట్లాడి ఒప్పిస్తే తప్ప డిజిటల్ వెర్షన్లో కూడా ఈ పాట ఉండకపోవచ్చని చందూ అన్నాడు.