తండేల్‌ను ఎక్కువగా నమ్మింది పల్లవినే: చందూ మొండేటి
ఈ గ్యాప్ లో వచ్చిన సినిమాలు నిరాశపరచడంతో అందరి దృష్టి తండేల్ పైనే ఉంది.
ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న తండేల్ సినిమా కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి అయిపోయి రెండు వారాలవుతున్న నేపథ్యంలో ఆడియన్స్ కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో వచ్చిన సినిమాలు నిరాశపరచడంతో అందరి దృష్టి తండేల్ పైనే ఉంది. పైగా తండేల్ ట్రైలర్ కూడా అందరికీ నచ్చింది.
నాగచైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందింది తండేల్. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మొత్తం సినీ ప్రమోషన్స్ లో బిజీ అయింది. మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. తండేల్ సినిమా ఆలోచన ఇప్పటిది కాదని, అన్ని సినిమాల్లాగా ఈ సినిమాను మామూలుగా ఊహించుకుని రాసుకోలేదని ఇది జరిగిన కథ అని డైరెక్టర్ చందూ మొండేటి వివరించాడు.
ఈ సినిమా కథ ముందుగా గీతా ఆర్ట్స్ దగ్గరకు వెళ్లిందని, అయితే ఈ కథను అల్లు అరవింద్, బన్నీ వాసు కంటే ఎక్కువగా సాయి పల్లవినే నమ్మిందని ఆయన తెలిపాడు. కోవిడ్ టైమ్ లో సాయి పల్లవికి 20 పేజీలున్న స్క్రిప్ట్ పంపితే అది బాగా నచ్చిందని చెప్పిన సాయి పల్లవి తనని కొన్ని ప్రశ్నలడిగిందని, ఆ ప్రశ్నలకు తగ్గట్టు తాను మిగిలిన స్టోరీని పూర్తి చేశానని చందూ వెల్లడించాడు.
అంతేకాదు సాయి పల్లవి తన వర్క్ విషయంలో 100% ఇస్తుందని, నాకు ఓకే అయిన షాట్స్ ను కూడా ఆమే దగ్గరుండి మళ్లీ మరో షాట్ చేద్దామంటుందని, చైతన్య చేసిన సీన్ డెప్త్ కు తను ఇలా నటిస్తే సీన్ సరిగా పండదని చెప్పి మరీ చేస్తుందని, ఆమె అంత పర్ఫెక్ట్ గా ఉంటుందని ఈ సందర్భంగా చందూ తెలిపాడు.
ఇక నాగచైతన్య తండేల్ సినిమా ద్వారా తనకొక నిజాయితీ కథ దొరికిందని, ఎవరికైనా అలాంటి కథ దొరికినప్పుడు మోటివేషనల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని అన్నాడు. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కు తండేల్ లో చేసిన రాజు పాత్రకి అసలు పొంతనే ఉండదు కాబట్టి ఆ పాత్ర ఎలా ఉంటుంది? ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు చైతూ చెప్పాడు. తండేల్ సినిమా తన కెరీర్ లోబెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని చైతూ చెప్తున్నాడు.