స్వ‌గ్రామంలో ఆస్కార్ లైబ్ర‌రీ.. చంద్ర‌బోస్‌కి హ్యాట్సాఫ్‌

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో దిగ్గ‌జ లిరిస్టుగా చంద్ర‌బోస్ సుప‌రిచితులు. ఆయ‌న కెరీర్ లో అవార్డులు రివార్డుల‌కు కొద‌వేమీ లేదు.

Update: 2024-07-03 11:26 GMT

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో దిగ్గ‌జ లిరిస్టుగా చంద్ర‌బోస్ సుప‌రిచితులు. ఆయ‌న కెరీర్ లో అవార్డులు రివార్డుల‌కు కొద‌వేమీ లేదు. RRR నుంచి `నాటు నాటు` (చంద్ర‌బోస్ ర‌చ‌యిత‌) ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ గెలుచుకుంది. ఆస్కార్ క్లాస్ క‌మిటీలోను చంద్ర‌బోస్ స‌భ్యుడిగా గౌర‌వం అందుకున్నారు. ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై భార‌తీయ సినీప‌రిశ్ర‌మ ఔన్న‌త్యాన్ని, తెలుగు చిత్ర‌సీమ గౌర‌వాన్ని పెంచిన ర‌చ‌యిత‌గాను చంద్ర‌బోస్ పేరు మార్మోగుతోంది. గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాలు, హాలీవుడ్ ఫిలింక్రిటిక్స్ అవార్డుల్లోను బోస్ ప్ర‌తిభ‌కు గుర్తింపు ద‌క్కింది.


ఇప్పుడు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని త‌న స్వ‌స్థ‌లం చల్లగరిగ గ్రామంలో ఒక లైబ్రరీని ప్రారంభించి తన ఆస్కార్ ట్రోఫీని అక్కడ ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ లైబ్రరీలో సాహిత్యం, చరిత్ర, సైన్స్, ఫిలాసఫీ స‌హా ప‌లు అంశాల‌తో కూడుకున్న ర‌క‌ర‌కాల పుస్త‌కాల‌ను ఇక్క‌డ ఉంచుతారు. ఆస్కార్ ట్రోఫీతో పాటు ఈ ప్రాంతంలోని ఔత్సాహిక కళాకారులు, రచయితలను ప్రోత్సహించడానికి చంద్రబోస్ త‌న‌వంతు కృషి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. లైబ్రరీని జూలై 4న ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆస్కార్ లైబ్రరీకి చంద్రబోస్ పేరుతో నామ‌కర‌ణం చేస్తారు. బోస్ ప్ర‌య‌త్నానికి సినీప్ర‌ముఖుల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

``గ్రంధాలయం ఎల్లప్పుడూ నాకు ఒక ప్రత్యేక ప్రదేశం... ఇక్కడ నేను చిన్నప్పటి నుండి సాహిత్యం సంతంపై నాకు ఉన్న ప్రేమను మ‌రింత‌గా పెంచుకున్నాను!`` అని చంద్రబోస్ అన్నారు. ``నేను నా గ్రామానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను.. ఇక్కడ ఉన్న పిల్లలకు వారి ఆకాంక్ష‌లు నెర‌వేర్చుకోవ‌డానికి, కలలను అన్వేషించడానికి అవకాశాలను అందించాలనుకుంటున్నాను`` అని పేర్కొన్నారు.

Tags:    

Similar News

eac