న‌య‌న‌తార డాక్యుమెంట‌రీపై మ‌రో నిర్మాత దావా!

అయితే తాజాగా న‌య‌న‌తార‌ను మరో స‌మ‌స్య చుట్టు ముట్టింది.

Update: 2025-01-06 05:56 GMT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌- స్టార్ హీరో ధ‌నుష్ మ‌ధ్య కాపీ రైట్ వివాదం కోర్టులో ఉన్న సంగ‌తి తెలిసిందే. తన సినిమా పుటేజీని అనుమ‌తి లేకుండా న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ ( బియండ్ ది పెయిర్ టేల్) ఎలా ఉప‌యో గిస్తార‌ని ధ‌నుష్ 10 కోట్లు దావా వేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు మ‌ద్రాస్ హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. అయితే తాజాగా న‌య‌న‌తార‌ను మరో స‌మ‌స్య చుట్టు ముట్టింది.

ఈ డాక్యుమెంట‌రీలోనే 'చంద్ర‌ముఖి' చిత్రంలోనే కొన్ని క్లిపుల‌ను అనుమ‌తి లేకుండా వినియోగించుకున్న‌ట్లు తెర‌పైకి వ‌చ్చింది. దీంతో నిర్మాత‌లిప్పుడు న‌య‌న‌ర‌తార‌, నెట్ ప్లిక్స్ లో కు లీగ‌ల్ నోటీసులు ఇచ్చారు. త‌మ కంటెంట్ ను చ‌ట్ట విరుద్దంగా వినియోగించుకున్నంద‌కు గానూ 5 కోట్లు ప‌రిహారం చెల్లించాల‌ని నోటీసులిచ్చిన‌ట్లు తెలుస్తోంది. దింతో'బియాండ్ ది పెయిర్ టేల్' మ‌ళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ధ‌నుష్ కి ఇప్పుడు 'చంద్ర‌ముఖి' నిర్మాత‌లు రామ్ కుమార్ గ‌ణేష‌న్, ప్ర‌భులు కూడా తోడ‌య్యారు. డాక్యుమెంట‌రీపై క‌లిసి మ‌రిన్ని కేసులు వేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. 'చంద్ర‌ముఖి' నిర్మాత‌ల రియాక్ష‌న్ నేప‌థ్యంలో న‌య‌న‌తార ఎలాంటి బ‌ధులిస్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ధ‌నుష్ విష‌యంలో ఇప్ప‌టికే న‌య‌న‌తార తాను చెప్పాల‌నుకున్న‌ది అంతా చెప్పేసింది. ధ‌నుష్ అనుమతి కోసం ఎంత ప్ర‌య‌త్నించినా తాను టచ్ లో కి రాక‌పోవ‌డంతో త‌న మేనేజ‌ర్ తో మాట్లాడి ముందుకెళ్లిన‌ట్లు చెప్పుకొచ్చింది.

అలాగే ధ‌నుష్ కు త‌న‌పై ఎందుకంత కోపంగా ఉన్నాడో? ఎందుకు అంత‌గా ద్వేషిస్తున్నాడో? అర్దం కాలేద‌ని వ్యాఖ్యానించింది. ఒక‌ప్పుడు తాను మంచి స్నేహితుడు గా ఉండేవాడ‌ని..కానీ ఇప్పుడాయ‌న ప‌క్క‌న వాళ్లు చెప్పిన మాట‌లు విని దూరం జ‌రిగిన‌ట్లు చెప్పుకొచ్చింది. ఇలాంటివి క్లియ‌ర్ చేసుకోవ‌డానికి ధ‌నుష్ తో మాట్లాడ‌ల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌డం లేద‌న్నారు. న్యాయంగా , త‌ప్పులేకుండా చేసిన ప్ర‌య‌త్నం విష‌యంలో ఎవ‌రికీ భ‌య‌పడాల్సిన ప‌నిలేద‌న్నారు. మ‌రి చంద్ర‌ముఖి నిర్మాత‌ల విష‌యంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News