హీరోలంతా ఇక థియేటర్లకు వెళ్లరా?
మరి ఈ ఘటన తర్వాత టాలీవుడ్ హీరోల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా? అభిమానుల సమక్షంలో థియేటర్ కి వెళ్లి సినిమా వీక్షించడం అన్నది జరగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయా?
సంధ్య థియేటర్ ఘటనతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడికింది. దేశ వ్యాప్తంగా ఈ ఉందంతం ఎంతటి సంచల నమైందో తెలిసిందే. ఘటన తర్వాత అల్లు అర్జున్ జైలుకెళ్లడం రాత్రంతా జైల్లో ఉండటం..ఉదయం విడుదల వ్వడం.. అటుపై యావత్ టాలీవుడ్ బన్నీ ఇంటికి క్యూ కట్టిన సన్నివేశం ఎంతటి వివాదాస్పదమవుతోందో? కనిపి స్తూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఘటనపై స్పందించిన తీరు? తాజాగా నేడు మళ్లీ బన్నీ పోలీస్ విచారణ ఎదుర్కోవడం...ప్రతీది ఎంతో సంచలనమైంది.
'పుష్ప-2' రిలీజ్ అయిన రోజు నుంచే ఇప్పటి వరకూ ఇదే టాపిక్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్ద ఎత్తున చర్చకు తారి తీసింది. ఈ వివాదానికి ఎలాంటి ముగింపు దొరుకుతుందన్నది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మెన్, నిర్మాత దిల్ రాజు ఈ వివాదానికి వీలైనంత త్వరగా పుల్ స్టాప్ పెట్టాలని భావి స్తున్నారు. దీనిలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. చట్ట పరంగా జరగాల్సిన ప్రోసస్ అంతా జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి 18 మందిపై పోలీస్ కేసు పైల్ అయింది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరి ఈ ఘటన తర్వాత టాలీవుడ్ హీరోల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా? అభిమానుల సమక్షంలో థియేటర్ కి వెళ్లి సినిమా వీక్షించడం అన్నది జరగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. సాధారణంగా కొత్త సినిమా రిలీజ్ రోజున అభిమానులతో కలిసి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు చూడటం అన్నది జరుగుతుంటుంది. థియేటర్లో వాళ్లతో కలిసి చూస్తే వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంది? మాస్ పల్స్ పట్టుకోవడం కోసం హీరోలు ఇలా థియేటర్లకు వెళ్లి తొలి షో చూస్తుంటారు. అలా సినిమా చూస్తే హిట్ అవుతుందనే సెంటిమెంట్ చాలా మంది హీరోల్లో ఉంది.
కొంత మంది హీరోలు ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా ముఖానికి మాస్క్ లు కట్టుకుని ప్రేక్షకులతో కలిసి పోతారు. ఒక్కోసారి అలాంటి సన్నివేశాలు బయటకొస్తే? అభిమానులు సర్ ప్రైజ్ అవుతుంటారు. ఎక్కువగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్ల చూడటం అన్నది కొంత మంది హీరోలకు అలవాటు. అయితే తాజా ఘటనతో హీరోలంతా అలెర్ట్ అయ్యే అవకాశం ఉంది. భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ పునరావృతం అవ్వడానికి అవకాశం లేకపోలేదు. ఇకపై అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకునే హీరో? ఈ విషయాలన్ని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.