గేమ్ చేంజర్.. ఈ రన్ టైమ్ లో శంకర్ మార్క్ యాక్షన్ ట్విస్టులు

శంకర్ కూడా ఈ సినిమాలోని రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించాడు.

Update: 2024-12-21 07:05 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక మూవీపైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందని అనుకుంటున్నారు. శంకర్ కూడా ఈ సినిమాలోని రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించాడు.

ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని యూఎస్ లో ప్లాన్ చేయడం మేజర్ హైలెట్. . చిత్ర యూనిట్ మొత్తం ఈ ఈవెంట్ కోసం యూఎస్ వెళ్ళారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫైనల్ కాపీ సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. 2 గంటల 45 నిమిషాల నిడివితో శంకర్ ఈ మూవీ ఫైనల్ కాపీ రెడీ చేశారని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా కథ గురించి కూడా ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది.

మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. తండ్రికొడుకులుగా రెండు భిన్నమైన టైమ్ లైన్స్ లలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఒక క్యారెక్టర్ లో స్టూడెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా మారిన క్యారెక్టర్ ఉంటుంది. అలాగే పొలిటికల్ లీడర్ గా మరో పాత్రలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా స్టూడెంట్ గా కాలేజీ బ్యాక్ డ్రాప్ సీన్స్ ఉంటాయంట. అలాగే ఛాలెంజ్ లతో పాటు రెండు యాక్షన్ సీక్వెన్స్ ని పెట్టారని తెలుస్తోంది.

ఇంటర్వెల్ బ్యాంగ్ లో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా మారడం ఉంటుందని సమాచారం. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీక్వెన్స్, పొలిటికల్ ట్విస్ట్ లు, క్లైమాక్స్ యాక్షన్ డ్రామా చాలా కీలకంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. సినిమా కథతో బలమైన సోషల్ డ్రామాగా శంకర్ తెరపై ఆవిష్కరించినట్లు టాక్. ఆయన నుంచి వచ్చిన ‘జెంటిల్మన్’, ‘ఒకే ఒక్కడు’ తరహాలో ‘గేమ్ చేంజర్’ కథాంశం కూడా చాలా యూనిక్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

మెజారిటీ సినిమా ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందంట. ఈ సినిమాలో ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా నటించాడు. చరణ్, సూర్య పాత్రల మధ్య మంచి పోటీ ఉంటుందని అంటున్నారు. ఇక శ్రీకాంత్ కూడా పొలిటికల్ లీడర్ గా బలమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కియారా అద్వానీ, అంజలి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. సునీల్ క్యారెక్టర్ కూడా చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది.

Tags:    

Similar News