అబ్బాయ్..బాబాయ్ 2024లోనే సాధ్యం చేస్తారా?

ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉంటుంద‌ని చాలా కాలం క్రితం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్యాన‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ ఓ సినిమా చేస్తాడ‌ని ప‌వ‌న్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

Update: 2023-12-27 07:02 GMT

అబ్బాయ్..బాబాయ్ 2024లోనైనా సాధ్యం చేస్తారా? అభిమానుల క‌ల‌ని వ‌చ్చే ఏడాదైనా నెర‌వేరుస్తారా? అంటే అందుకు ఆస్కారం బ‌లంగానే క‌నిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా అబ్బాయ్? ఎవ‌రా బాబాయ్ ? అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. వారే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉంటుంద‌ని చాలా కాలం క్రితం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్యాన‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ ఓ సినిమా చేస్తాడ‌ని ప‌వ‌న్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

దీంతో బాబాయ్ తోనూ తాను అంతే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉన్నానని చ‌ర‌ణ్ కూడా చెప్పాడు. అది బాబాయ్ కెరీర్ లోనే భారీ బ‌డ్జెట్ సినిమా అవుతుంద‌ని అంత‌కు మించి మాట‌ల్లేవ్ అనే సారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం ఉర‌క‌లేయ‌డం..అవి రెట్టింపు అవ్వ‌డం.. ఆత‌ర్వాత నెమ్మ‌దిగా చ‌ల్ల‌బ‌డ‌టం అన్నీ జ‌రిగిపోయాయి. ఎందుకంటే ఆ ప్ర‌క‌ట‌న ఇచ్చి ఏడాది..ఏడాదిన్న‌రో అవ్వ‌లేదు. రెండేళ్ల‌కు పైగానే అవుతుందేమో. అప్పుడు ఇద్ద‌రు ముమ్మ‌రంగా సినిమాలు చేస్తున్నారు.

ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఆస‌మ‌యంలో ఆ ర‌క‌మైన స్టేట్ మెంట్ ఇద్ద‌రి నుంచి విడి విడిగా వ‌చ్చింది. కానీ ఆ త‌ర్వాత ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే సినిమాలు కూడా మానేస్తాని ప్ర‌క‌టించారు. కానీ మ‌ళ్లీ ఆ మాట‌ని వెన‌క్కి తీసుకుని సినిమాలు మానేస్తే ఆర్దిక ఇబ్బందులు వ‌స్తాయ‌ని భావించి మ‌ళ్లీ డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. అలా పీకే మ‌ళ్లీ మ్యాక‌ప్ వేసుకోవ‌డం జ‌రిగింది.

ఇక రామ్ చ‌ర‌ణ్ తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ని దాటి పాన్ ఇండియాకి వెళ్లిపోవ‌డం..అక్క‌డ నుంచి హాలీవుడ్ అంటూ చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ అబ్బాయ్-బాబాయ్ ప్రేమాభిమానాలు మాత్రం అలాగే కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 2024 లోనైనా ఇద్ద‌రు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటార‌ని అభిమానులు ఆశిస్తున్నారు. క‌నీసం ఎవ‌రో ఒక‌రు తమ సొంత బ్యాన‌ర్లో సొంత హీరోతో సినిమా చేస్తే చూడాల‌ని అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక వ‌చ్చే ఏడాది తీరుతుందని ఆశిద్దాం.

Tags:    

Similar News