చార్లీ చాప్లిన్ శవపేటికను ఎత్తుకెళ్లారట?
హాస్య నటుడు చార్లీ చాప్లిన్ గురించి అందరికి తెలుసు. హాస్యాన్ని పండించడంలో ఆయనకు ఆయనే పోటీ.
హాస్య నటుడు చార్లీ చాప్లిన్ గురించి అందరికి తెలుసు. హాస్యాన్ని పండించడంలో ఆయనకు ఆయనే పోటీ. ఆయనకు ఎవరు రారు సాటి. జోకులకు మారుపేరైనా చాప్లిన్ ఎన్నో సినిమాల్లో నటించారు. సహజమైన నటనతో అందరిని మెప్పించారు. హాలీవుడ్ హాస్య నటుల్లో ఆయనే ప్రముఖుడు. అందుకే ఆయన సినిమాలంటే అందరికి ఇష్టమే. ఇప్పటికి కూడా ఆయన సినిమాలు ఎగబడి చూస్తుంటారు.
చార్లీ చాప్లిన్ చనిపోయిన తరువాత 1978లో శ్మశానం నుంచి ఆయన శవపేటికను ఇద్దరు దొంగలు తవ్వి ఎత్తుకెళ్లారట. ఆయన హాస్యం మెదడులోనే ఉందని నమ్మేవారట. అందుకే ఆయన శవ పేటికను దొంగలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ శవ పేటిక ఇవ్వాలంటే రూ.4 లక్షల పౌండ్లు (సుమారు 24 లక్షల డాలర్లు ) ఇవ్వాలనే నిబంధన విధించారు. దీంతో చాప్లిన్ శవ పేటిక సంచలనం కలిగించింది.
డబ్బు ఇవ్వకపోతే పిల్లలకు హాని చేస్తామని చాప్లిన్ నాలుగో భార్య ఊనాను బెదిరించారు. దీంతో ఆమె భయపడింది. తన పిల్లలకు నష్టం కలుగుతుందని భయపడి వారు అడింది ఇచ్చేందుకు అంగీకరించిందట. కానీ విషయం ఆమె తెలియజేయకపోయినా బయటకు పొక్కింది. ఐదు వారాలకు కిడ్నాపర్లను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
చార్లీ చాప్లిన్ జీవితం ఓ తెరిచిన పుస్తకం. ఆయన ప్రతీది అందరితో పంచుకునే వారు. దీంతో ఆయన జీవితంలో రహస్యాలు ఉండేవి కావు. అందరితో కలివిడిగా ఉండేవారు. అభిరుచులు కూడా పంచుకునే వారు. ఈనేపథ్యంలో ఆయన శవపేటిక అప్పట్లో దొంగతనానికి గురి కావడంతో సంచలనం కలిగించింది. శవపేటికతో కూడా వ్యాపారాలు చేయడం గమనార్హం.
చార్లీ చాప్లిన్ జోకులు చూస్తే అందరికి నవ్వు రావడం సహజం. ఆయన వేషధారణ కూడా విచిత్రంగా ఉంటుంది. నెత్తి మీద టోపీతో గమ్మత్తుగా కనిపిస్తారట. అందుకే ఆయన సినిమాలు ప్రత్యేకంగా నిలిచేవి. అందరు పగలబడి నవ్వుకునేవారు. అంతటి మహోన్నత వ్యక్తి శవపేటిక మాయం కావడం అప్పట్లో ట్రెండ్ కలిగించింది.