పాపం... ఈ నటి దుస్థితి చూడండి
బాలీవుడ్ స్టార్ నటి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌తో 2019లో చారు అపోస వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది.;
సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు అవ్వడం, ఓడలు బండ్లు అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో కనీసం తిరగడానికి బండి లేని వారు రెండు మూడు సక్సెస్‌లతో ఒక్కసారిగా స్టార్స్‌గా మారడం, పెద్ద కార్లలో తిరగడం మనం చూస్తూ ఉంటాం. ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసిన వారు వరుసగా ఫ్లాప్స్ పడితే ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా మనం చూడవచ్చు. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా, టీవీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి మనం చూడవచ్చు. ఒకప్పుడు వెలుగు వెలిగిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనం మీడియాలో చూస్తూ ఉంటాం.
ఇప్పుడు ఒక నటి పరిస్థితి అలాగే ఉంది. పేరుకు ప్రముఖ నటి అయినప్పటికీ ఆమె ఇప్పుడు బట్టలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆమె ఆర్థిక ఇబ్బందుల కారణంగా నటనకు పూర్తిగా దూరం అయ్యాను అని, ఆన్ లైన్ ద్వారా బట్టల వ్యాపారం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ఆ నటి మరెవరో కాదు చారు అపోస.. ఈమె గురించి నార్త్ ఇండియన్ బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితం. ఎన్నో హిందీ సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా ఈమెకు వెండి తెరపై కూడా నటించే అవకాశాలు వచ్చాయట. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాలను సున్నితంగా తిరస్కరించింది.
బాలీవుడ్ స్టార్ నటి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌తో 2019లో చారు అపోస వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. 2021లో పాప జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. దాంతో 2023లో రాజీవ్ సేన్, చారు అపోసలు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న సమయంలో రాజీవ్ సేన్ భరణంగా కొంత మొత్తం చెల్లించాడని బాలీవుడ్ మీడియా వర్గాల టాక్. విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ పాప బాధ్యత విషయమై కోర్టులో న్యాయ పోరాటం చేశారు. చివరకు పాపను చారు అపోస కు కోర్టు అప్పగించిందని తెలుస్తోంది.
ముంబైలో నెలవారి ఖర్చులు ఎక్కువగా ఉంటున్న కారణంగా తన సొంత ప్రాంతంకు వెళ్లి పోయింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికనీర్ లో చారు అపోస తన బట్టల వ్యాపారం చేస్తుంది. ఆన్ లైన్ ద్వారా బట్టలు అమ్ముతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు నటిగా పలు సీరియల్స్‌లో నటించి మెప్పించిన చారు అపోస ఇప్పుడు ఉన్న దుస్థితి చూసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పిన చారు అపోస బట్టల వ్యాపారంలో అయినా సక్సెస్ కావాలని సోషల్ మీడియాలో ఆమెకు పలువురు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.