ఛావా రీమేక్/డబ్బింగ్ రైట్స్ అల్లు అరవింద్ ఎలా మిస్సయ్యారబ్బా?

దాదాపు పదేళ్ల కిందట వచ్చిన 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌' సినిమాతోనే విక్కీ తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫ్రంట్ లైన్ హీరో అయ్యాడు.

Update: 2025-02-19 20:30 GMT

ప్రస్తుతం దేశంలోని సినీ అభిమానులంతా ఒక్కటే విషయంలో ఊగిపోతున్నారు.. థియేటర్లలో చిన్న పిల్లలు సైతం భావోద్వేగంతో కన్నీరు పెడుతున్నారు.. యువత అయితే దేశభక్తితో కదిలిపోతున్నారు.. పెద్దవారు సైతం చలించిపోతున్నారు.. కారణం.. బాలీవుడ్ విలక్షణ హీరో విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' సినిమా. వాస్తవానికి స్వాతంత్ర్య సమర యోధుడు సర్దార్ ఉద్ధం సింగ్, భారత తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జీవితం సామ్ బహదూర్ జీవిత చరిత్రల ఆధారంగా తీసిన సినిమాల్లో తన నట కౌశలంతో జీవించిన విక్కీ కౌశల్.. ఇప్పుడు ఛత్రపతి శివాజీ కమారుడు శంభాజీ పోరాట పటిమను ప్రపంచానికి చాటేలా తీసిన 'ఛావా'లో చెలరేగాడు. దాదాపు పదేళ్ల కిందట వచ్చిన 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌' సినిమాతోనే విక్కీ తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫ్రంట్ లైన్ హీరో అయ్యాడు.

రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ యంగ్ హీరో అంటే విక్కీ కౌశల్ అనడంలో సందేహం లేదు. ఇక ఛావా విషయానికి వస్తే విక్కీని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పటికే రూ.150 కోట్లపైగా కలెక్షన్స్ తో దుమ్మురేపుతోంది. ఇప్పటికి విక్కీ కెరీర్ లో ఇదే అతిపెద్ద బ్లాక్ బస్టర్. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు విక్కీ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కెరీర్ లో అతడు వెనక్కుతిరిగి చూసుకునే అవసరం లేదనేలా కలెక్షన్ల సునామీ కురిపిస్తున్నారు.

అదొక్కటే లోటు...

ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ చేసిన అతిపెద్ద పొరపాటు.. ఛావాను ఇతర భాషల్లొకి డబ్ చేయకపోవడం. లేదంటే విక్కీ నటనా ప్రతిభకు ఇంకా పెద్ద హిట్ అయ్యేది. హిందీ తప్ప దక్షిణాది ఏ భాషలోనూ డబ్బింగ్ చేయకపోవడం 'ఛావా'కు మైనస్.

మరి అల్లు అరవింద్ ఎలా మిస్సయ్యారు?

అల్లు అరవింద్.. తెలుగు మెగా ప్రొడ్యూసర్. కానీ, ఏ భాషలో మంచి చిత్రం ఉన్నా ఆయన కళ్లు వెంటాడుతాయి. మెగాస్టార్ ఠాగూర్ నుంచి సూర్యను సూపర్ స్టార్ చేసిన గజిని తో కలుపుకొని మొన్నటి రిషభ్ శెట్టి కాంతార వరకు అల్లు అరవింద్ హక్కులు దక్కించుకుని రీమేకో, డబ్బింగో చేసి డబ్బులు దండిగా దండుకున్నారు. అలాంటి అల్లు అరవింద్ మరి ఛావాను ఎలా మిస్సయ్యారనేది అంతుపట్టని ప్రశ్న.

బహుశా పుష్ప-2 తొక్కిసలాట వివాదం, కేసుల్లో తన కుమారుడు అల్లు అర్జున్ ఇరుక్కోవడంతో అల్లు అరవింద్ ఛావాపై ఫోకస్ పెట్టలేకపోయారేమో..? లేదా తండేల్ మీద బాగా ఫోకస్ చేసి మిస్సయారో ఏమో..? ఏదేమైనా ఈ విషయంలో అల్లు అరవింద్ తెలుగు ప్రజలకు లోటు చేశారు. మరి ఛావాను ఇప్పటికైనా ఆ సినిమా దర్శక నిర్మాతలైనా ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తారా? లేదా? చూద్దాం..

Tags:    

Similar News