'ఛావా' లా వీరమల్లు కూడా రికార్డులు సృష్టిస్తుందా!
ఇటీవల రిలిజ్ అయిన 'ఛావా' గొప్ప హిందు దేశ భక్తి చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అనంతరం ప్రతీ హిదువు తప్పక చూడాల్సిన చిత్రంగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఇటీవల రిలిజ్ అయిన 'ఛావా' గొప్ప హిందు దేశ భక్తి చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అనంతరం ప్రతీ హిదువు తప్పక చూడాల్సిన చిత్రంగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అన్నట్లే సినిమాకి అంతటి గొప్ప ఆదరణ దక్కింది. అందుకే 400 కోట్ల వసూళ్లను సాధించగలిగింది. హిందు రాజ్యంలో ముస్లీమ్ ల పెత్తనంపై శంభాజీ మహారాజ్ పోరాటం...నిర్యాణం ఎంతో స్పూర్తి వంతమైనది. అందుకే థియేటర్లు ఛత్రపతి శంభాజీ నినాదాలతో దద్దరిల్లాయి. తెలుగు భాషలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తమైంది.
నిజంగా తెలుగులో కూడా రిలీజ్ చేసి ఉంటే? సినిమా అదనంగా మరో100 కోట్లు సాధించేది అన్నది కాదనలేని నిజం. ఈ సినిమా రిలీజ్ అనంతరం సోషల్ మీడియాలో హిందు విభాగాలు ప్రత్యేకంగా ప్రమోట చేయడం కూడా కలిసొచ్చింది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున హిందు సంఘాల సోషల్ మీడియా గ్రూప్ లు ఏర్పటైన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతను ఆయా సంఘాలు నెట్టింట తీసుకుని ముందుకెళ్తున్నాయి.
హిందూత్వ సమలేఖన హ్యాండిల్స్, హిందూ పుష్ లాంటి ఆర్గనైజేషన్లు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా కోసం కూడా ఇవన్నీ పని చేయాల్సిన సమయం వచ్చేసింది. ఔరంగజేబుపై వీరమల్లు పోరాటం సినిమాలో హైలైట్ కానుంది. ఈ నేపథ్యంలో హిందుత్వం కాన్సెప్ట్ కూడా ఇక్కడ తెర లేపినట్లే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ నుంచి నుదిటిన పొడవాటి బొట్టులుక్ లో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కొన్ని నెలలుగా సనాతన ధర్మ పరిరక్షకుడిగానూ పనిచేస్తున్నారు.
దీనిలో భాగంగా వివిధ రకాల మాలలు కూడా ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందు పార్టీ అయిన బీజేపీకి రాజకీయంగానూ మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు సినిమా కారణంగానూ అభిమానులకు మరింత సనాత నీగా రీచ్ అవుతున్నాడు. వీరమల్లు రిలీజ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున హిందు సంఘాల నుంచి మద్దతు లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందు సంఘాలన్నీ స్వచ్ఛందగా ముందుకొచ్చి సినిమాని ప్రోత్సహిస్తారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇది పవన్ పాన్ ఇండియా ఇమేజ్ కి బాగా కలిసొచ్చే అంశమే.