ఛావా బాక్సాఫీస్.. మొదటి రోజు కంటే 10వ రోజు ఎక్కువ!
శివాజీ సావంత్ రాసిన చావా అనే మారాఠీ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలకు ముందే మంచి హైప్ సొంతం చేసుకుంది.
2025లో హిందీ సినీ ప్రపంచంలో మరో సెన్సేషన్‌గా నిలుస్తున్న చిత్రం చావా. మరాఠా సామ్రాజ్యంలో రెండో రాజు అయిన శంబాజి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ముఖ్యపాత్రలు పోషించారు. శివాజీ సావంత్ రాసిన చావా అనే మారాఠీ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలకు ముందే మంచి హైప్ సొంతం చేసుకుంది.
సినిమా విడుదలైన తర్వాత ఆ హైప్ కాస్త బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా మహారాష్ట్రలో మాత్రమే కాదు, ఉత్తరభారతదేశంలోనూ భారీ రెస్పాన్స్‌ని రాబట్టింది. ముఖ్యంగా ముంబై, పుణె ప్రాంతాల్లో ప్రతి షో హౌస్‌ఫుల్ బోర్డులతో నడుస్తోంది. ఈ కథలోని మరాఠా శంబాజి త్యాగం, పోరాటం ప్రేక్షకులను ఆవేశపరుస్తున్నాయి.
కలెక్షన్ల పరంగా కూడా చావా అసలు సత్తా చూపుతోంది. విడుదలైన మొదటి రోజే 33.10 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు 39.30 కోట్లు, మూడో రోజు 49.03 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా దాదాపు 121.43 కోట్లు వసూలు చేయడం విశేషం. వీకెండ్ తర్వాత కూడా సినిమా వేగం తగ్గలేదు.సినిమా విజయంలో ప్రధాన కారణం విక్కీ కౌశల్ నటన. శంబాజిగా విక్కీ ప్రదర్శించిన నటన ప్రతి ప్రేక్షకుడిని కదిలించింది.
ముఖ్యంగా ఆయన ఎమోషనల్ సీన్స్, యుద్ధ సన్నివేశాల్లో చూపించిన ఆవేశం, తండ్రి శివాజీ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే తపనను పర్ఫెక్ట్‌గా ప్రదర్శించాడు. రష్మిక మందన్నా కూడా తన పాత్రలో అద్భుతంగా నటించింది. చావా జీవితంలో ఆమె పాత్ర ఎంత కీలకమో, అదే రీతిలో ఈ సినిమాలోనూ ఆమె ప్రదర్శన ఆకట్టుకుంది.
కలెక్షన్ల పరంగా చూస్తే మొదటి రోజు 33.10 కోట్లు ఉన్న వసూలు, మూడో రోజు 49.03 కోట్లకు పెరగడం, ఆ తర్వాత కూడా నాలుగో, ఐదో రోజుల తర్వాత కూడా స్థిరంగా 25-32 కోట్ల మధ్య సాగుతుండటం విశేషం. నిజానికి ఒక హిస్టారికల్ మూవీకి ఇంత స్థిరమైన కలెక్షన్లు రావడం సాధారణం కాదు. కానీ శంబాజిగా జీవితకథలోని ఎమోషన్, మరాఠా గర్వం, కుటుంబ అనుబంధం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూనే ఉంది.
సినిమా బడ్జెట్ 130 కోట్లు. కానీ 10 రోజులకే ఈ సినిమా 334.51 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించడంతో నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చింది. బిజినెస్ పరంగా చూస్తే, ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లడమే కాదు, ఈ వారంలోనే లాభాల బాటలోకి చేరుతోంది. ఈ వసూళ్లతో విక్కీ కౌశల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
టాప్ 10 రోజుల కలెక్షన్లు (నెట్):
మొదటి రోజు: ₹33.10 కోట్లు
రెండవ రోజు: ₹39.30 కోట్లు
మూడవ రోజు: ₹49.03 కోట్లు
నాలుగవ రోజు: ₹24.10 కోట్లు
ఐదవ రోజు: ₹25.75 కోట్లు
ఆరవ రోజు: ₹32.40 కోట్లు
ఏడవ రోజు: ₹21.60 కోట్లు
ఎనిమిదవ రోజు: ₹24.03 కోట్లు
తొమ్మిదవ రోజు: ₹44.10 కోట్లు
పదవ రోజు: ₹41.10 కోట్లు
మొత్తం కలెక్షన్ (10 రోజులు): ₹334.51 కోట్లు నెట్