'ఛావా'.. 2 వారాల్లో ఎంత వసూలు చేసింది?

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితాధారంగా రూపొందిన ఆ సినిమా.. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో దూసుకుపోతోంది

Update: 2025-02-28 13:24 GMT

ఛావా.. ఛావా.. ఛావా.. ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే చర్చ నడుస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితాధారంగా రూపొందిన ఆ సినిమా.. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కూడా ఆదరణ లభిస్తోంది.

అయితే త్వరలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మార్చి 7వ తేదీన ప్రముఖ గీతా ఆర్ట్స్ సంస్థ.. ఛావా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. వెండితెరపై చూడాలని కోరింది. దీంతో ఇప్పుడు అంతా మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో ఛావా మూవీ.. విడుదలైన తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఛావా మూవీ రూ.500 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 14 రోజులకు గాను 555.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

కేవలం ఇండియాలో 484.3 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఛావా మూవీ దూసుకుపోతుందని చెప్పాలి. మరో వారంలో రానున్న తెలుగు వెర్షన్ కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఫుల్ రన్ లో ఛావా మూవీ.. బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ నెంబర్స్ ను నమోదు చేసేటట్లు కనిపిస్తోంది.

ఇక ఛావా సినిమా విషయానికొస్తే.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో కనిపించారు. శంభాజీ మహరాజ్‌ గా విక్కీ కౌశల్‌, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక యాక్ట్ చేశారు. శంభాజీ మహరాజ్ స్టోరీలో కీలక పాత్ర అయిన ఔరంగజేబును నటుడు అక్షయ్‌ ఖన్నా పోషించారు.

సినిమాలో విక్కీ కౌశల్ యాక్టింగ్ కు ఇప్పటికీ ప్రశంసలు లభిస్తున్నాయి. అద్భుతంగా నటించారని కొనియాడుతున్నారు. కొన్ని సీన్స్ కు అయితే గూస్ బంప్స్ వచ్చాయని చెబుతున్నారు. రష్మిక కూడా ఆకట్టుకుందని అంటున్నారు. మొత్తానికి మూవీ బ్లాక్ బస్టర్ అని ఇప్పటికీ రివ్యూస్ వస్తున్నాయి. మరి ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా ఛావా మూవీ ఎంతటి వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News