'ఛావా' మొదటి వారం కలెక్షన్స్‌.. మతి పోవడం ఖాయం!

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఛావా' సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2025-02-21 09:36 GMT

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఛావా' సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మొదటి ఆటకు అంతంత మాత్రంగానే వసూళ్లు నమోదు అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్‌ నిరాశను కలిగించాయి. కానీ సినిమా మొదటి రోజు మొదటి ఆటకు వచ్చిన స్పందనతో రెండో షో నుంచి టికెట్స్ కట్‌ కావడం మొదలు అయింది. మొదటి రోజు ఓవరాల్‌గా డీసెంట్‌ ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి రూ.200 కోట్ల వసూళ్లను ఛావా సినిమా రాబట్టింది అంటూ అధికారికంగా నిర్మాతలు ప్రకటించిన విషయం తెల్సిందే.


ఛావా సినిమాకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా హిందీ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్లు రావు. కానీ ఛావా సినిమాను హిందీ వర్షన్‌ అయినా చూసేందుకు రెడీ అంటూ థియేటర్లకు జనాలు పరుగులు తీస్తున్నారు. మొదటి రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్లు రాలేదు. ఆ తర్వాత నుంచి భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఛావా సినిమా మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది. అంతా ఊహించినట్లుగానే మొదటి వారం రోజుల్లో ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకు పోతుంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి వారం పూర్తి అయ్యేప్పటికి సినిమాకు రూ.310 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఇండియాలో రూ.225 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే విదేశాల్లో ఛావా సినిమా దాదాపు రూ.85 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయి వసూళ్లు రావడంతో సెకండ్‌ వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి ఛావా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్యలో వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. హిందీతో పాటు సౌత్‌ భాషల్లోనూ సినిమాను డబ్‌ చేసి ఉంటే వసూళ్ల పరంగా సరికొత్త నెంబర్స్‌ నమోదు అయ్యేవి అనేది కొందరి అభిప్రాయం.

సినిమా మొదటి వారం రోజుల్లో రూ.310 కోట్ల వసూళ్లను రాబట్టడం సంచలనంగా మారింది. ఈ నెంబర్ చూస్తూ ఉంటే మతి పోతుందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. రేపటి నుంచి వీకెండ్‌ కావడంతో వసూళ్లు ఓ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. బుక్ మై షో లో గంటకు 30 వేల నుంచి 50 వేల టికెట్‌లు అమ్ముడు పోతున్నాయి. ఈ స్థాయిలో ఈమధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాల వసూళ్లు నమోదు కాలేదు, టికెట్‌లు బుక్‌ కాలేదు. లాంగ్‌ రన్‌లో ఛావా సినిమా వెయ్యి కోట్లు సాధించడం ఖాయం అంటూ చాలా బలంగా బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. అది సాధ్యం కావాలి అంటే సెకండ్‌ వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి ఛావా సినిమాకు రూ.500 కోట్ల వసూళ్లు నమోదు కావాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఛావా ఆ మ్యాజిక్ నెంబర్‌ను టచ్ చేసేనా చూడాలి.

Tags:    

Similar News