చావా దెబ్బకి టికెట్ అమ్మకాల్లో వణుకుతున్న బుక్మైషో!
2025 మొదటి రెండు నెలలు ముగియకముందే బుక్ మై షోలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
2025 మొదటి రెండు నెలలు ముగియకముందే బుక్ మై షోలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇక టికెట్ అమ్మకాల రికార్డుల్లో చావా సినిమా సునామీలా దూసుకెళ్లింది. విక్కీ కౌశల్ హీరోగా, చత్రపతి శంబాజి మహారాజ్ జీవితంలో కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ 4.90 మిలియన్ టికెట్స్ అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో ఈ సినిమాకు ఏర్పడిన క్రేజ్ తో దేశమంతా వైరల్ అవుతోంది.
కేవలం అక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ హిందీ సినిమాకు సాలీడ్ రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా హిస్టారికల్ సినిమాలపై ఆసక్తి ఉన్న ఆడియన్స్ ఈ సినిమాను మిస్ కాకుండా బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక, సాంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయిన వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 3.59 మిలియన్ టికెట్స్ తో రెండవ స్థానంలో ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసిన ఈ మూవీపై వెంకీ అభిమానులు, మాస్ ఆడియన్స్ లోనూ బాగా హైప్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
మరొక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'గేమ్ చేంజర్' 2.25 మిలియన్ టికెట్ అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది. రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అంతగా ఆడకపోయినా మొదట బజ్ కారణంగా ఆడియెన్స్ టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. ఇక రీసెంట్ గా విడుదలైన 'తండేల్' సినిమాకి కూడా బుక్ మై షోలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో 1.19 మిలియన్ టికెట్స్ అమ్ముడయ్యాయి.
థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కట్టిస్తోన్న ఈ సినిమా, ఎగువన ఉన్న పెద్ద సినిమాలను దాటే అవకాశముంది. అలాగే, అక్షయ్ కుమార్ 'స్కై ఫోర్స్' (1.99 మిలియన్), అజిత్ కుమార్ 'విడా ముయార్చి' (1.51 మిలియన్), బాలయ్య 'డాకూ మహారాజ్' (1.36 మిలియన్) సినిమాలు కూడా బుకింగ్ లలో మంచి ఫిగర్స్ సాధించాయి.
అయితే ఈ లిస్ట్ లో వేరే సినిమాలన్నింటికంటే చావా సినిమా దూకుడు ముందు చిత్తు అవుతున్నాయి. మొత్తం మీద 2025 మొదట్లో బుక్ మై రికార్డ్స్ ను తుడిచిపెట్టేసిన చావా సినిమా, బాక్సాఫీస్ దగ్గర కూడా అదే జోరు చూపిస్తూ నిర్మాతలకు బంపర్ లాభాలు తీసుకువస్తోంది. మరోవైపు తండేల్ లాంటి సరికొత్త కథా చిత్రాలు కూడా దూసుకెళ్తుండటంతో ఈ ఏడాది టికెట్ అమ్మకాలలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు రావడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
బుక్ మై షో 2025 టికెట్ అమ్మకాల లిస్ట్:
1. చావా - 4.90 మిలియన్
2. సంక్రాంతికి వస్తున్నాం - 3.59 మిలియన్
3. గేమ్ చేంజర్ - 2.25 మిలియన్
4. స్కై ఫోర్స్ - 1.99 మిలియన్
5. విడాముయార్చి - 1.51 మిలియన్
6. డాకూ మహారాజ్ - 1.36 మిలియన్
7. తండేల్ - 1.19 మిలియన్
8. దేవా - 5.65 లక్షలు
9. బ్యాడఆస్స్ రవికుమార్ - 2.18 లక్షలు
10. ఆజాద్ - 1.22 లక్షలు