వీర‌మ‌ల్లులో ఔరంగజేబు@ 2.0!

ఈ నేప‌థ్యంలో జోదా అక్బ‌ర్ లాంటి సినిమాలు స‌రిగ్గా ఆడ‌లేదు అన్న‌ది కాద‌న‌లేని నిజం.

Update: 2025-02-18 19:30 GMT

బాలీవుడ్ లో చారీత్రాత్మ‌క కథ‌లు తెర‌కెక్కితే అందులో ఎక్కువ‌గా డ్రామా హైలైట్ అవుతుంది. భారీ వార్ స‌న్నివేశాల‌తో పాటు డ్రామాకి కూడా అక్క‌డ మేక‌ర్స్ పెద్ద పీట వేస్తుంటారు. పాత్ర‌లో వీలైనంత వ‌ర‌కూ వాస్త‌వాన్ని చూపించాలి అన్న కోణంలో బాలీవుడ్ క‌థ‌లు క‌నిపిస్తుంటాయి. క‌థ‌ని క‌మ‌ర్శియ‌ల్ గా డ్రెమ‌టై జ్ చేయ‌డం అన్న‌ది చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో జోదా అక్బ‌ర్ లాంటి సినిమాలు స‌రిగ్గా ఆడ‌లేదు అన్న‌ది కాద‌న‌లేని నిజం.

ల్యాగ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో నిడివి పెరిగిపోవ‌డం...బోరింగ్ పాత్ర‌ల‌తో మొఘ‌ల సామ్రాజ్యం క‌థ అప్ప‌ట్లో నార్త్ ఆడియ‌న్స్ కి కూడా స‌రిగ్గా రుచించ‌లేదు. దీంతో సంజ‌య్ లీలా భ‌న్సాలీ లాంటి వారు త‌దుప‌రి జాగ్ర‌త్త ప‌డ్డారు. 'ప‌ద్మావ‌త్' సినిమాని ప‌ర్పెక్ట్ గా క‌మ‌ర్శియ‌ల్ యాస్పెక్ట్ లో తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. తాజాగా ఇటీవ‌ల రిలీజ్ అయిన `ఛావా` కూడా ఆ కోవ‌కే చెందుతుంది. ల‌క్ష్మ‌ణ్ ఉట్టేక‌ర్ తెర‌కెక్కించిన 'ఛావా' ఇంత పెద్ద విజ‌యం సాధించిందంటే? ఆ క‌థ‌ని డ్రెమ‌టైజ్ చేసిన విధానంతోనే సాధ్య‌మైంది అన్న‌ది వాస్త‌వం.

సినిమాలో ప్ర‌తీ పాత్ర అద్భుతంగా పండింది. అందులోనూ శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటన, ఔరంగజేబు పాత్ర‌లో అక్ష‌య్ ఖ‌న్నా పెర్పార్మెన్స్ ప్రేక్షుకుల్ని క‌ట్టిపడేసాయి. ఇప్పుడు అదే ఔరంగ‌జేబు పాత్ర‌ను హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో బాబి డియోల్ పోషిస్తున్నాడు. మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడనేది? అస‌లు థీమ్. వీర‌మ‌ల్లుగా అత‌డి పోరాటాలు సినిమాలో హైలైట్ అవుతాయి ? అన్న‌ది వాస్త‌వం.

కానీ ఔరంగ‌జేబు పాత్ర‌ను ఇక్క‌డ ఎలా హైలైట్ చేస్తారు? అన్న‌ది ఇక్క‌డ అంతే ఆస‌క్తిక‌రం. `ఛావా`లో ఆ పాత్ర‌ను ఎంతో క్రూరంగా చూపించారు. ఈ నేప‌థ్యంలో వీర‌మ‌ల్లులో ఆ పాత్ర స్వ‌భావం ఎలా ఉంటుంది? ఆ పాత్ర‌ను తీసుకున్న విధానం ఎలా ఉంటుంది? అన్న‌ది చ‌ర్చ‌నీయాంగా మారింది. ఈ చిత్రాన్ని తెర‌కెక్కి స్తున్న‌ది కూడా అనుభ‌వం గ‌ల ద‌ర్శ‌కుడు కాదు. డైరెక్ట‌ర్ గా నాలుగైదు సినిమాలు మాత్ర‌మే చేసాడు.

క్రిష్ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ బాధ్య‌త‌లు తీసుకుని కెప్టెన్ కుర్చీ ఎక్కారు. ఈ సినిమాకి క‌థ రాసింది క్రిష్. దాన్ని డీల్ చేస్తున్న‌ది జ్యోతి కృష్ణ. ఈ నేప‌థ్యంలో వీర‌మ‌ల్లులో పాత్ర‌ల్ని ఎలా మ‌ల్చుతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News