వారసులు ఇప్పటికైనా శాంతిస్తారా?
ఇటీవల రిలీజ్ అయిన `ఛావా` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 10 రోజుల్లోనే చిత్రం 300 కోట్ల వసూళ్లతో రికార్డు చిత్రాల వరుసలో నిలిచింది.
ఇటీవల రిలీజ్ అయిన `ఛావా` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 10 రోజుల్లోనే చిత్రం 300 కోట్ల వసూళ్లతో రికార్డు చిత్రాల వరుసలో నిలిచింది. ఇక ఈ సినిమా తెరకెక్కించిన లక్ష్మణ్ ఉటేకర్ ను అయితే కీర్తించని వారు లేరు. అతడి పని తనాన్ని ప్రశంసిస్తూ దేశ వ్యాప్తంగా హిందువులంతా సందేశాలు పంపిచారు. గొప్ప సినిమా తీసాడని...దేశానికి ఇలాంటి దేశ భక్తి భావం గల సినిమాలు అవసరమని ప్రశంసించారు.
అయితే ఈ సినిమా విషయంలో లక్ష్మణ్ ఉటేకర్ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కున్న సంగతి తెలిసిందే. సినిమాలోని తమ పూర్వీకులు గన్హోజీ, కన్హాజీ షిర్కేలను అవమానించారని షిర్కే వారసులు ఆరోపించారు. సినిమాలో తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బ తీసారని, 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని షిర్కే వారసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆరోపణలపై లక్ష్మణ్ స్పందించారు.
తనుకు ఎవరి మనోభావాలు కించ పరిచే ఉద్దేశం లేదన్నారు. అలా ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించాలని కోరారు. సినిమాని కేవలం సినిమాగా చూడాలని...వ్యక్తిగతంగా భావించొద్దని విజ్ఞప్తి చేసారు. మరి ఈ క్షమాప ణలతో షిర్కే వారసులు శాంతిస్తారా? లేదా చట్టపరమైన చర్యలకు సిద్దమవుతారా? అన్నది చూడాలి. బాలీవుడ్ లో చారీత్రాత్మక సినిమాలు తీసిన సమయంలో ఇలాంటి విమర్శలు, హెచ్చరికలు సహజమే.
`జోదా అక్బర్`, `మొహంజదారో`, `పద్మావత్` లాంటి సినిమాలు రిలీజ్ అయిన సమయంలో కూడా ఆ చిత్రాల దర్శకులు చాలా విమర్శలు ఎదుర్కున్నారు. సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు తొలగించా లని...మనోభావాలు దెబ్బ తిన్న వేళ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి.